తెలుసుకుంటున్నా--- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ప్రియా!
ఎందుకు
నాకు ప్రేమను చవిచూపావ్?
అందుకే
నేను
నా ప్రేమను
పండించుకుంటున్నా,
మండించుకుంటున్నా!
ప్రేమను
హసిస్తున్నా
పరిహసిస్తున్నా!
నా తలలో 
తలపుల తలుపులు తెరిచి 
అనురాగం 
నా హృదయరాగంగా 
భువనరాగాన్ని ఆలపిస్తున్నా! 
నేను నిన్ను 
ప్రేమించకుండా
పట్టువదలడంలేదు,
పారిపోవడంలేదు!
ఔను చెలీ!
ఇప్పుడిప్పుడే
ప్రేమకు సరైన అర్థం 
తెలుసుకుంటున్నా!!
*********************************
;--
కామెంట్‌లు