నిర్లక్ష్యము.. అచ్యుతుని రాజ్యశ్రీ
 ఒకసారి మోటర్ బైక్ పై స్వామి సుఖబోధానంద ఒక విద్యార్థి తో వెళ్తున్నారు.ఆరాత్రి ఎదురుగా ఓకారు హెడ్ లైట్స్ లేకుండా వచ్చి బైక్ ని ఢీ కొట్టింది.యువకుడు తెలివిగా బైక్ ని తప్పించటంతో ప్రాణాలు దక్కాయి.కాని బైక్ ఇండికేటర్ లైట్స్ పగిలాయి.ఆయువకుడికి పిచ్చి కోపం వచ్చింది.కారు వెంటబడి ఆపాలని పోలీసు రిపోర్టు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాడు.స్వామీజీతో అన్నాడు" నాబైక్ హెడ్ లైట్స్ పగలటం వల్ల నాకు కోపం రాలేదు.ఆకారువాడు నిర్లక్ష్యంగా కనీసం ఆగి సారీ అనకుండా వెళ్లాడు.పొగరుగా కారు నడుపుతూ నన్ను నిర్లక్ష్యం చేయడం బాధగా ఉంది." మనల్ని అమితంగా బాధించేది ఏంటో తెలుసా? మనల్ని నిందిస్తే అవమానిస్తే కోపం వస్తుంది.కానీ నిర్లక్ష్యం అలక్ష్యం గా ప్రవర్తిస్తే ఆబాధను భరించలేము. 🌷
కామెంట్‌లు