శ్రీ శిరిడీ సాయి లీలామృతం;- : సి.హెచ్.ప్రతాప్
 భక్తుల పాలిట ఆశ్రిక కల్పవృక్షము, కామధేనువు,భక్త జన బాంధవుడు,కలియుగ దైవం అయిన శ్రీ సాయినాధునిది ఒక అద్భుతమైన , అసామాన్యమైన విశిష్ట అవతారం. అఖిలాండకోటి బ్రహ్మాండములకు నాయకునిగా, యోగులందరికీ సామ్రాట్టుగా కీర్తించబడుతున్న శ్రీ సాయినాధుడు భక్త సులభుడు. భక్తులకు ఎట్టి కఠోర నియమాలకు పెట్టక, కేవలం దర్శన, స్మరణలతోనే ప్రసన్నులౌతారు. తనకు సంపూర్ణ, సర్వస్య శరణాగతి ఒనరించిన భక్త జనావళికి వారి లలాట లిఖితంలో లేని వాటిని సైతం ప్రసాదీంచే బ్రహ్మ దేవుడు శ్రీ సాయి. భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని తరచుగా బాబా చెప్పేవారు.ఐహికపరమైన , ప్రాపంచిక కోరికలతో దర్శించరాదని ఇతరులకు బోధిస్తున్న ఒక భక్తునితో "అలా చెప్పవద్దు. నా సన్నిధికి మొదట అందరూ అలానే వస్తారు, కష్టాలు,కోరికలు తీరి , జీవితంలో ఒక స్థాయి చిక్కాక నా మార్గంలో ప్రయాణం చేసి సన్మార్గులౌతారు "అని అన్నారు శ్రీ సాయినాధులు.
శ్రీ సాయి శిరిడీకి వచ్చిన తొలొ రోజులలో ఆకుపచ్చని కఫ్నీ , తలకట్టు ధరించి, సటకా చేత బట్టుకొని, నిత్యం ఆ గ్రామంలో కేవలం అయిదు ఇళ్ళలో మాత్రమే భిక్షాటనం చేసేవారు. అంతే కాక, ఆయన రోగులకు ఉచితంగా వైద్యం చేసేవారు. ఇతర వైద్యులవలే కాక శ్రీ సాయి వైద్యవిధానం చాలా విభిన్నంగా వుండేది. ఒకసారి శిరిడీ గ్రామంలో గణపతి హరికణాడే అనే ఒక భూకామందుకు కుష్టువ్యాధి వచ్చింది. బాబా యొక్క అనుగ్రహఫలితంగా ఆ వ్యాధి వెంటనే తగ్గిపోయింది. కానీ బాబా అతనికి విధించిన కొన్ని కట్టుబాట్లను హరికనాడే ఉల్లంఘించడంతో ఆ వ్యాధి మళ్ళీ ప్రాణాంతకంగా తిరగబెట్టి కొద్ది రోజులలోనే అతను మరణించాడు.హరికణాడే మరణ వార్త విన్న శ్రీ సాయిలో ఒక విధమైన పరవర్తన వచ్చింది. " ఈ మనుషులు ఎంత పిచ్చివారు? వారి మంచి కోరి చెప్పినా , తమకు నచ్చిందే చేస్తారు కాని మొరొకటి చెయ్యరు గాక చెయ్యరు"అనుకొని ఆనాటి నుండి రోగులకు మందులు ఇవ్వడం మానేసి తాను శిరిడీలోని మశీదులో తన యోగశక్తితో వెలిగించిన పవిత్రమైన ధుని నుండి వచ్చే బూడిదను ప్రసాదంగా ఇవ్వసాగారు.శ్రీ సాయి తన భక్తులకు ఆశీర్వదించి ఇచ్చే బూడిదనే ఊదీ(విభూతి) అని అంటారు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును ప్రసాదించడమే గాక సమస్త దుఖములను, భయాందొళనలను దూరం చేసేది.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం