కమలా కోట్నీస్ .; -సేకరణ :;డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై

 ప్రసిద్ధ భారతీయ చలనచిత్ర నటి. నిర్మాత. ఆంగ్లో ఇండియన్ అయిన ఈమె 1940-50 ల మధ్య కాలంలో పలు తెలుగు, హింది చిత్రాలలో నటించింది. ఈమె 1946 లో బాలీవుడ్ నటుడు దేవానంద్‌కు తొలి హీరోయిన్ గా నటించింది. ఈమె తెలుగు సినీ నటి లతకు అత్తయ్య.
ఈమె అసలు పేరు కమల. స్వంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు. తల్లి తెలుగు వనిత. తండ్రి బ్రిటిష్ జాతీయుడు. బ్రిటీష్ సైన్యంలో పని చేసేవాడు. బాల్యంలోనే ఈమె ఒక జమిందార్‌కు దత్తత ఇవ్వబడింది. తదనంతరం కమలాబాయిగా మారింది. 1940 లో 'జీవన జ్యోతి' చిత్రంలో నటించడం ద్వారా సినిమారంగ ప్రవేశం చేసింది. 1941 లో 'పాండురంగ కోట్నీస్'ను ప్రేమించి వివాహం చేసుకొంది. భర్త అలనాటి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ 'డి.ఎస్. కొట్నీస్'కు స్వయానా సోదరుడు. అయితే వివాహానంతరం కొద్దికాలానికి కమలా కొట్నీస్ తన భర్తతో విడిపోయింది.
ఈమె చిన్న చెల్లెలు 'లీల'కు రామనాథపురం (తమిళనాడు) ఎస్టేట్ వారసునితో పెళ్ళి జరిగింది. 1970-80 లనాటి ప్రముఖ తెలుగు, తమిళ నటి లత (అందాల రాముడు సినిమా ఫేం), రాణీ రాజేశ్వరీ నాచియార్‌లు ఇరువురూ కమలా కొట్నీస్‌కు స్వయాన చెల్లెలి కూతుర్లు.
కమలా కొట్నీస్ 1940 లో జీవన జ్యోతి సినిమాలో హీరోయిన్ సి. కృష్ణవేణికి స్నేహితురాలి పాత్రలో నటించడం ద్వారా తెలుగు సినిమారంగ ప్రవేశం చేసింది. భాగ్యలక్ష్మి సినిమాలో కమలా కొట్నీస్ పైన చిత్రీకరించిన "తిన్నె మీద చిన్నోడా వన్నెకాడా ..." అనే పాట తోనే (గాయకురాలు: రావు బాల సరస్వతి) తెలుగు సినిమాలో ప్లేబాక్ పద్ధతి ప్రారంభం అయ్యింది. అంతకుముందు ఎవరి పాటను వారే పాడుకోవడం జరిగేది. ఆమె నటించిన తెలుగు సినిమాలు.
• జీవన జ్యోతి (తెలుగు) – 1940 : హీరోయిన్‌కు స్నేహితురాలి పాత్ర
• బాలనాగమ్మ (తెలుగు) – 1942
• చెంచులక్ష్మి (తెలుగు) – 1943 : లక్ష్మీదేవి పాత్ర
• భాగ్యలక్ష్మి (తెలుగు) – 1943 : కుంజి పాత్ర
• శ్రీ సీతారామ జననం (తెలుగు) – 1943 : కైకేయి పాత్ర
• తాసిల్దార్ (తెలుగు) – 1944 : రజని పాత్ర
• సామ్రాట్ విక్రమార్క (తెలుగు) -1958 : సౌగంధి పాత్ర
తరువాత హిందీ చలనచిత్రరంగ ప్రవేశం చేసింది. 1946 లో తన మొదటి హిందీ చిత్రం 'హమ్ ఏక్ హై' (Ham-Ek-Hain) లో ఆనాటి బాలీవుడ్ హీరో 'దేవానంద్‌'కు తొలి హీరోయిన్ గా నటించింది. 1949 లో తను నటించిన హిందీ చిత్రం 'సతి అహల్య' కు నిర్మాతగా కూడా ఉంది. ఆమె నటించిన హిందీ సినిమాలు.
• హమ్ ఏక్ హై (Ham-Ek-Hain) (హిందీ) – 1946
• గోకుల్ (Gokul) (హిందీ) – 1946
• మేరా సుహాగ్ (Mera Suhag) (హిందీ) – 1947
• ఆగే బదో (Agae Badho) (హిందీ) – 1949
• సీదా రాస్తా (Seedha Raasta) (హిందీ) – 1949
• సతి అహల్య (Sati Ahalya) (హిందీ) – 1949.
కమలా కొట్నీస్ 2000 లో మరణించారు.
 

కామెంట్‌లు