ఆత్మజ్ఞానం-- సి.హెచ్.ప్రతాప్

 ఆధ్యాత్మిక సాధనలు ఎన్ని చేసినా అంతఃకరణ శుద్ధి అవసరం అన్నది శాస్త్రవాక్యం. భగవంతుడిని ఆరాధిస్తూ ,ఆయన చేసిన సృష్టిలో కొన్నిటిని గొప్పగా, కొన్నిటిని తక్కువగా చూడటం అల్పత్వం అనిపించుకుంటుంది.ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఒకటే వస్తువు. అన్నిటిలోనూ ఉన్నది ఒకే ఆత్మ. అయితే అజ్ఞాని ఆ విషయం గుర్తించక ఈ సృస్టిలో వున్న సమస్త పదార్ధాలు తనకు భిన్నమైనదని భావిస్తుంటాడు. తన చుట్టూ మనుషుల్లో, వస్తువుల్లో భేదభావం ప్రదర్శిస్తూ అశాంతి కొనితెచ్చుకుంటాడు. భగవంతుని ఆరాధనలోనూ మనసు నిలుపలేకపోతాడు. కానీ, సమస్త జీవరాశుల్లో తానే ఆత్మరూపంలో  ఉన్నాననీ, అవన్నీ అద్దంలో ప్రతిబింబాల వంటివని గుర్తించగలిగిన వాడు ఉత్తముడు.ఆత్మజ్ఞానం  అంటే ఆత్మ గురించి జ్ఞానం
అంటే, మన గురించి మనం తెలుసుకోవడం.
నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆత్మను కూడా అని తెలుసుకోవడం ఎంతో అవసరం.ఆత్మ అంతరాత్మ, పరమాత్మ అనేవి మూడూ ఒక్కటే. రూపగుణాలు ఒక్కటే. అవధులు మాత్రం వేర్వేరు.  ఒక్కటే అయిన ఆత్మ అవసరానికి 'అంతరాత్మ' అనిపిస్తుంది. పైకి వెళ్లాక  'పరమాత్మగా' వ్యవహరిస్తుంది. ఆ రహస్యం తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. అసలు ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం. ఆత్మను గురించి మరింతగా తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఇక్కడ తెలుసుకునేది మనస్సుతో కాదు.ఆచరణలతో వచ్చే అనుభవాలే అనుభూతులు. మనిషి పొందే అనుభూతులే ఆత్మానుభూతులు. ఆ ఆత్మానుభూతులనే ఆత్మజ్ఞానంగా పిలుస్తారు’’ అంటారు  కబీరు.అనేక జన్మల నుండి కోరికలు, అలవాట్లు, అభ్యాసాలు, సంస్కరణలు, సంస్కారములు అన్నీ కలిసి ఏర్పడి నదే జన్మాంతర వాసన. మానవుడు పూర్వజన్మ వాసనల నుండి బయటపడలేక తిరిగి అవియే సత్యమని తలచి జన్మ జన్మల భ్రాంతిలో పడి కొట్టుకొంటూ తిరిగి జనన మరణ చక్రములో భ్రమిస్తున్నాడని తెలుసుకోవడ్దం ఆత్మజ్ఞానంలో మొదటి అంశం. 
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం