ఆకాశ మార్గాన పరిగెత్తే
ఈ మేఘాల అల్లిక
ఆకులపై నాట్యంచేసే
ఈ పసిమి వెన్నెల రజను
నా మేనును స్పృశించే
నా చిరుగాలి సోన
నా కన్నుల్లో నిండే
తొలి సంధ్యా కాంతి
నీ ప్రేమే తప్ప
మరేదీ కాదు!
అవును!
నాకు తెలుసు!
అది నా హృదయానికి
తెచ్చే సందేశం!
నన్ను వివశుడిని చేస్తూ
నీ కళ్ళు
నా కళ్ళలోని
అంతరంగాన్ని చూస్తున్నాయి!
నీ పాదాలను
నేను
నా హృదయంతో స్పృశిస్తున్నాను!!
*********************************
నీప్రేమ;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి