"Manthan samvadd India's finest mines OnThings that matter"
"Samvadd 2023 at Manthan is to spark through intelligent conversations "open minds, open doors" the tagline, communicates the idea of Manthan
Samvadd is an integral part of our mission.Manthan Samvadd 2005 September నుండి ప్రారంభం. నేటికీ కంటిన్యూగా కార్యక్రమాలు ప్రతిసంవత్సరంలో ఒకసారి సెకండ్ అక్టోబర్, గాంధీ జయంతి నాడు రోజు మొత్తం కార్యక్రమాలు జరుగుతాయి.
సెప్టెంబర్ 2005 నుండి నేటి సెప్టెంబర్ 2023 వరకు 15 సంవత్సరాలుగా సమస్త ద్వారా 440 ప్రసంగాలు జరిగినవి. 15 సంవత్సరాలుగా పదివేల మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*2005 సెప్టెంబర్ నుండి నేటి 2023 సెప్టెంబర్ వరకు పాల్గొన్న ప్రముఖులు ప్రసంగ వక్తులుగా:-
Doctor P.M Bhargava, RAMCHANDRA GUHA, ASDUDDIN OWAISI, JAVED AKHTAR, PRATAP BHEEL MAHITI, SUBBARAO KAMBATI, AJAY SHUKLA, PROFESSOR SRINATH RAGHAVAN, MORI MORI, MENAKA GURUSWAMY, KANGAN DEEP KANGA, WIND GROVER, JAY RAM RAMESH, TM KRISHNA MALIK SORO BAN, RAMESH KUMAR, AATISH M, వీరందరూ సాంస్కృతిక ఆర్థిక సామాజిక రాజకీయ ప్రముఖులు. చాలామంది ప్రముఖులు గతం నుండి పాల్గొన్నారు. నేడు కూడా జరగబోయే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
గాంధీ జయంతి సెకండ్ అక్టోబర్, 2023 ,నాడు పాల్గొన్న స్పీకర్స్, మరియు వారు మాట్లాడిన టాపిక్స్, అందులో వచ్చిన ముఖ్యమైన అంశాలు:---
I. Justice S.Muralidhar(RTD), Former Chief Justice of Odisha High Court.
TOPIC:-M.K.Gandhi, the Lawyer:A Precursor to the Mahatma.
మహాత్మా గాంధీజీ భారత స్వతంత్ర సమరానికి అత్యంత ప్రముఖ నాయకుడని, ఆయన భారతీయ స్వాతంత్ర చట్టము మరియు అహింస పరంగా ఆలోచించే వ్యక్తి. న్యాయవాదిగా సౌత్ ఆఫ్రికా లోను మరియు భారతదేశంలోనూ కోర్టులలో వాదించాడు. అనేకసార్లు వాదనలో అపజయం పొందిన ఒక ధైర్యం కలిగిన వ్యక్తిగా వకీలుగా వారు పర్ఫెక్ట్ లాయర్ గా ఉండేవారు. లాయర్ గా పనిచేసేటటువంటి వాళ్ళు చదవడం రాయడం మాట్లాడడం బాగా నేర్చుకోవాలని అనేవారు. తాను కూడా చేసి చూపించాడు. లాయర్లు ఫెయిల్యూర్స్ నుండి సక్సెస్ లో నేర్చుకోవాలని అన్నారు. ఆయన ఒక లాయర్ గా ధైర్యంతో వాదించేవారు. వాయిస్ ఆఫ్ ప్రతిష్టగా సైడ్ ఆఫ్ ట్రూత్ గా పొలిటికల్ యాక్టివిటీ గా పనిచేశాడు. లాయర్స్ ను పనిచేయాలని మార్గదర్శనం చేశాడు .గాంధీజీ ఆలోచన," మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుందని "ఆలోచనతో ప్రయాణం చేసినటువంటి మహాత్ముడు అని వివరించారు.
II.Yamini Aiyar,President Centre for Research,New Delhi
*TOPIC:Citizen vs Labharthi?Debating the evolution of India's fledgling Welfare State.
Labharthi dwara లాభారతి ద్వారా ఉపాధి సహాయము ఆర్థిక సహాయం, విద్యుత్ సహకారము ,ఆరోగ్యము పరిశ్రమలు, విద్యాభ్యాస సహాయం, ఉపాధి నియమించుకోవడం మరియు విభిన్న ప్రాథమిక సేవలను అందిస్తుంది అనే ఆలోచన. ఇది ప్రాంతీయ సహకారంలో ఆలోచించడం, నగరాలకు లాభపరుస్తుంది .వెల్ఫేర్ స్టేట్ ప్రోగ్రాం లో నగర ఆవశ్యకతల అనుగుణంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. వెల్ఫేర్ స్టేట్ సమైక్య విధానం బట్టి పని చేయడంలో లేబర్ లాస్ బలహీనంగా ఉన్నాయి. సోషల్ ఆడిట్ అనేది ఉండదు ఇవన్నీ సక్రమంగా జరుగుతూనే గాంధీజీ కలలు కన్నా వెల్ఫేర్ స్టేట్ అవతరణ అవుతుందని ఆలోచనలను ముందు ఉంచారు. దేశానికి అభివృద్ధి జరగాలంటే గాంధీజీ గారు గ్రామ గ్రామం బాగుపడాలని ఆలోచన ఇందులో రావాలనేది వారు తెలియజేసినారు. నిజమైన ఎన్పవర్మెంట్ కావాలి అనేక అభివృద్ధి కొరకు ఇన్నోవేషన్స్ జరగాలి మహిళా సాధికారత కావాలి సమస్యలు వచ్చినప్పుడు ప్రోటెస్టు కొరకు మహిళలు కదలాలి పరిపాలనా వికేంద్రీకరణ కావాలి పర్సనల్ రాజకీయాలు ఉన్నాయి, నేడు మార్పు రావాలి మంచి అవకాశాలు అందరికి ఉండాలని అన్నారు.
III.Niraja GopalJayal,Avantha Chair &Professor of Politics King's India Institu,King's College London.
*TOPIC:--The Question of Academic Freedom.
వారు మాట్లాడుతూ అకాడమిక్ విద్యార్థులకు మరియు అధ్యాపకులకు అత్యుత్తమ స్థానం కలిగించుకోవడానికి ఇది ఉందని అన్నారు. ఇది పాఠశాల, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర విద్యార్థి సంస్థలకు అనువదించడం వలన అకాడమిక్ స్వాతంత్రాన్ని కి ప్రాధాన్యం ఉందని ,ఇది అనుభవిస్తున్న వారు సమస్యలు వచ్చినప్పుడు వారు విమర్శలు చేస్తూ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానాలు ఇవ్వాలి. కానీ ప్రభుత్వాలు విమర్శలను నిలిపివేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఇది వాక్ స్వాతంత్రానికి గొడ్డలి దెబ్బ అనేది అనిపించింది.
IV.Sampat Saral. Hindi Poet and Satirest.
హాస్యం ద్వారా రాజకీయ ఆర్థిక సామాజిక విషయాలను వీటిలోని సమస్యలను ఆలోచింప చేయడానికి తన హిందీ సాహిత్యం ద్వారా ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి? ఎలా ఉంది ?రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? వారి ఆలోచన ఎలా ఉంది ?ప్రజాస్వామ్యం ఎలా ఉంది? ఎలా ఉండాలి ?దేశం అభివృద్ధి చెందాలంటే మన ఆలోచన ఎలా ఉండాలి ?అనే విషయాలను అందరికీ అందించారు.
V.Dhanya Rajender.Co-founder and Editor-in-Chief,The News Minute.
TOPIC:--Why Independent News Media Should Thrive.
వారు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న సంఘటనలు తప్పుగా ప్రచారం వస్తున్నది. భారతదేశానికి ఇండిపెండెంట్ న్యూస్ మీడియా కావాలి. ఇండియాలో కోవిడ్ లో అంతా బాగున్నట్లుగా మీడియా భావించడం జరిగిందని అన్నారు. జరిగింది చాలా నష్టం దానిని నిజాయితీగా ప్రజలకు అందించడం జరగలేదు. ఈ విధంగా మీడియా అనేక విషయాల్లో పని చేస్తున్నది దేశంలో ఓటర్స్ పేర్లు తొలగించడం జరుగుతున్న ఈ న్యూస్ మీడియా ద్వారా రావడం లేదు. స్వయంగా పనిచేసే మీడియా ఈ రోజు భారతదేశంలో కనిపించడం లేదు. నిజాయితీగా పనిచేసే మీడియాపై కక్ష సాధింపులు జరుగుతున్నాయి. ఈ మార్పు కొరకు ప్రయత్నం జరగాలి. ఇండిపెండెంట్ మీడియా బయట పెరుగుతున్నది. డెమోక్రసీ కొరకు మీడియా బలోపేతం కావాలి. మీడియా నేతలు రిపోర్ట్ చేసే వార్తలను వ్యాపారిక వ్యాపన చేస్తున్నాయి. కొన్ని సమయాల్లో ప్రతిఫలాలను పొందడానికి మీడియా వార్తలను వ్యాపారిక రీతిలో ఉపయోగిస్తున్నారు .దీనిని మార్చడానికి చట్టాల ద్వారా మార్పు తీసుకురావడానికి జ్యుడీషియరిని ఉపయోగించుకోవాలని ,అనేక విషయాలను వారి ప్రసంగంలో అందించారు.
VI.Arghya Sengupta.Founder Director and Research Director.Vidhi Centre for Legal Policy
*TOPIC:--The Colonial Constitution of India.
వారి అంశంపై మాట్లాడుతూ భారతదేశంలో భారత గణరాజ్యంగా కొలీనియల్ పాలకుల నియంత్రణలను తీసుకున్న సంవిధానం. ఇది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారతీయ ప్రజలు రాజకీయ వాణిజ్యంలో పరిపాలన చేస్తున్నది. అనేక హోదాలు మరియు అధికారాలు అందిస్తుంది .మరియు ప్రజల అధికారాలను రక్షించే విధంగా సృజిస్తుంది. ఇది భారతీయ సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను నిర్వహించే విధానం నిర్వహించబడాలి. ఇది భారతీయ ప్రజల జీవనాన్ని సమ్మిదాన రూపంలో నిర్వహించాలి. కానీ అలా జరగడం లేదు. దాని కొరకు రాజ్యాంగ ప్రకారము వ్యవస్థలు పనిచేయడానికి మనం నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలని ఆలోచనను కలిగించారు.
VII.Supriya Sengupta.National Spokesperson and Chairman Of Social Media &Digital Platforms of Indian National Congress.
*TOPIC:--Fighting the Fake News Pandemic.
వారు తమ ప్రసంగంలో మన దేశంలో అబద్ధపు వార్తలు చాలా అభివృద్ధి చెందుతున్నాయి .ఎందుకంటే అబద్ధపు భయంకరమైన వార్తలు భారతదేశంలో వస్తున్నాయి .దీనికి కారణం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాడుకోవడం. ఎందుకంటే భారతదేశంలోని ప్రజలు చూసినట్లయితే వాట్స్అప్ను 54 కోట్ల ప్రజలు వాడుతున్నారు. ఫేస్బుక్ను 48.27 కోట్లు ప్రజలు వాడుతున్నారు .టెలిగ్రామ్ టెక్నిక్ ను 34.26 కోట్ల ప్రజలు వాడుతున్నారు .ఎఫ్బిఎం మెసేజెస్ 34.24 కోట్లు ప్రజలు వాడుతున్నారు వీటిని ఆసరా చేసుకుని అధికారంలో అధికార పక్షంలో ఉన్న దేశ రాష్ట్రంలోని నాయకులు నిరంతరం వాళ్ళు అధికారంలో ఉండాలని వీటి ద్వారా ఫేక్ న్యూస్ ను వ్యాపింప చేస్తున్నారు. సమాజానికి ఈ ఫేక్ న్యూస్ చాలా నష్టం కలిగిస్తున్నది. కావున వాటిని కట్టడి చేయడానికి రాజ్యాంగపరంగా ఉద్యమం కొనసాగాలి. న్యాయవ్యవస్థ ద్వారా దీనిని రూపుమాపడానికి ప్రయత్నం జరగాలి. సామాజిక సంస్థలు ప్రభుత్వం ద్వారా రాకుండా చూడాలి. నిరంతర ప్రయత్నం జరగాలి అని తెలిపినారు ఎన్నో విషయాలు.
ఈ కార్యక్రమంలో ప్రముఖుల యొక్క ప్రసంగాలు జరిగిన తర్వాత కార్యక్రమంలో పాల్గొన్న సభ్యుల ద్వారా వచ్చిన ప్రశ్నలకు ఆలోచింపజేసే సమాధానాలు కూడా అందించారు.
ఈ కార్యక్రమము నిరంతరము కొనసాగిస్తున్న విక్రమ్ గారు, వారి సహచరులందరూ ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కందాలపై వేసుకొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన విజ్ఞానవంతులు, ఉన్నత చదువులు చదువుకుంటున్న యువకులు ,వ్యాపారవేత్తలు రాజకీయ వ్యవస్థలో పనిచేస్తున్న నాయకులు, 1000 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ వెంకట్ రెడ్డి ,నేషనల్ కన్వీనర్ ,మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ మరియు పద్మశ్రీ మెగాసేస్ అవార్డు గ్రహీత శాంతా సినహా గారు వారితోపాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
వీరందరి అంశాలను విన్నట్లయితే నాకు గాంధీజీ గారి ఆలోచనలు గుర్తుకొస్తున్నాయి.
*దేశం అభివృద్ధి చెందటం అంటే అద్దాలమేడలు రంగుల గోడలు కాదు పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన అభివృద్ధి.
*అహింస ఎదుట ,సత్యం ఎదుట ,అసత్యం శాంతించాలి.
*మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది.
*మనిషి పుట్టుకతోనే పుట్టుకలో ప్రజాస్వామ్యవాది.
*ప్రజాస్వామ్యం మొత్తంగా అవలోకిస్తే, అది నైతిక సూత్రాల మీద ఆధారపడుతుంది. అనే విషయాలు మొత్తం కార్యక్రమంలో కనిపించింది వినిపించింది. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్న నినాదం వినిపించింది. దేశంలో ఉన్న ప్రజలందరికీ రాజ్యాంగ పీఠికలో ఉన్న తెలిపిన సమానత్వం సామాజిక న్యాయం ద్వారా పరిపాలన ఈ దేశంలో జరగాలని ఆలోచన కలిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి