సౌగంధిక- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అది
సన్నజాజుల సౌరభమా!? 
మొగలిరేకుల మధురిమానా!? 
గులాబీల గుబాళింపా!?
అదీగాక...
పారిజాత సుమాల పరిమళమా!? 
మనసును పులకింపజేసి 
తనువును పరవశింపజేస్తూ 
గాలిలో తేలివస్తున్న
ఈ సువాసనలు ఎక్కడివి???
ఆఁ…ఆఁ….ఆఁ….
నేను ఆఘ్రాణిస్తున్న ఈ పరీమళం
నీ నుండి వస్తున్నదే
కదూ!?... చెలీ!...
నేను గుర్తించా
అవును!
నీ నుండే ఆ సుగంధం!
నీవే ఆ సౌగంధికవు!!
*********************************

కామెంట్‌లు