నాగుల చవితి;- కొప్పరపు తాయారు

 ఇది మనకి చాలా పవిత్రమైన పండుగ. చాలా ముందు కాలం నుంచి కూడా చవితి పండగ జరుపుకుంటూనే ఉన్నారు. మరుచటి రోజు నాగ పంచమి .ఆ తరువాత రోజు సుబ్రహ్మణ్య షష్టి. ఈ మూడు రోజులు మనం సర్పాలకి వ్రతాలు పూజలు ఉపవాసాలు చేస్తాం
        మనమే కాదు అన్ని మతాల వాళ్ళు కూడా చేస్తారు దీనికి పద్ధతి ,కొంతమంది ఉపవాసం ఉంటారు .వారు స్నానం చేసి ఇంట్లో వెండి చిన్న  పాముని పెట్టుకొని పూజ చేస్తారు. తరువాత పుట్ట దగ్గరికి నువ్వులు బియ్యం కలిపి దంపి ఉండలు చేస్తారు దీన్ని చిమ్మిలి అంటారు తరువాత  నానబెట్టి వడపోసి ఆరబెట్టి కొద్దిగా ఆరిన తర్వాత మళ్లీ బెల్లం కలిపి దఃపి ఉండలు చేస్తారు దీన్ని చలిమిడి అంటారు ఇంకా వడపప్పు పానకం ఇవి కూడా చేసి పెట్టుకుంటారు ఇవన్నీ పట్టుకొని పుట్టలో పాలు పోసి పూజ చేసి ఇవన్నీ నైవేద్యం పెడతారు ఇలా చేయడం బాగా అలవాటైపోయింది ఎందుకంఇ టే ముందుకాలంలో ఇలా పూజ చేసి నైవేద్యం పెట్టి కూర్చుంటే పాములు ఆ ప్రసాదాన్ని స్వీకరించేవట.అంతటి గట్టి నమ్మకం.
      ఈ పూజలు వల్ల పిల్లలు లేని వారు మొక్కు కుంటే పిల్లలు కలిగే వారెంట. చెవి బాధలు చెవిపోటు రోగాలు మొక్కుకుంటే పోయేవట అంతేకాదు రైతన్న పొలం గట్టుమీద నడియాడుతూ ఉండడం వల్ల పాముల వల్ల అపకారం రాకుండా  ఈ పూజలు చేసేవారు. అంతటి మహత్తరమైన పూజ ఇది.
    దీపావళి అయిన తరువాత వచ్చే చవితి నాడు చేస్తారు.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం