సుప్రభాత కవిత - బృంద
కనక వీణ మీద
కమ్మని కవనం మీటుతూ
కలకలమంటూ దిగివచ్చి
కళకళలు తెచ్చిన వేకువ

మరకతమణుల వెలుగును
పచ్చని చేలకు బహుమతిగా
వెచ్చగ తెచ్చి బహుకరించి
పరవశింపచేసిన వేకువ

లేత కిరణాల వెలుగులతో
బంగరు రంగులు నింపుతూ
పొంగే ప్రేమల రేఖలతో 
పుడమికి ప్రేమలేఖ రాసే వేకువ

జలజలరాలే సువర్ణ సుందర
కాంతిధారల ముంచుతూ
జగతికి ఉత్సాహం  పంచుతూ
చైతన్య గీతికలా వచ్చే వేకువ

కలతలన్నీ మరిపించి
కలలతో మురిపించి
కొత్త ఆశలు కలిగిస్తూ
కనుల విందు చేసే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం