న్యాయాలు -294
శ్రోత్ర శృంగ న్యాయము
*****
శ్రోత్రః అనగా చెవులు. శృంగః అనగా కొమ్ములు.
ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అని అర్థము.
జంతువులలో కొన్నింటికి కొమ్ములు ఉంటాయి. అయితే అవి పుట్టేటప్పుడే కొమ్ములతో పుట్టవు. మొదట చెవులతో పుడతాయి. క్రమక్రమంగా వాటికి కొమ్ములు మొలిచి పెరుగుతాయి.
ఇక జిరాఫీలు మాత్రం కొమ్ములతో పుడతాయట.ప్రసవ సమయంలో పుట్టుకను అవి సులభతరం చేస్తాయట.
ఏదో ఒకటి అరా మినహా ఏ జంతువైనా పుట్టుకతో కొమ్ములను కలిగి వుండదు. తర్వాత్తర్వాత అవి అభివృద్ధి చెందుతాయి.ఏ జంతువు చెవులైనా మృదువుగా ఉంటాయి. పెరిగిన కొమ్ములు మాత్రం వాడిగా, వాటిని అవి రక్షించుకునేందుకు ఆయుధంలా ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటాయి.
అయితే మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ప్రత్యేకంగా మానవులకు ఎందుకు అన్వయించి చెప్పారో చూద్దాం.
కుటుంబంలో కానీ ,పని చేసే కార్యాలయంలో కానీ అప్పటి వరకూ ఎంతో పేరొందిన,తమదైన వ్యక్తిత్వంతో ముద్ర వేసుకున్న వ్యక్తులు వుంటారు .వాళ్ళు కొత్త వాళ్ళ ప్రవేశంతో తమ ఉనికిని కోల్పోవడమో, అప్పటి వరకు పొందిన గౌరవం పొందక పోవడమో జరుగుతుంది.
అంటే ఆ తర్వాత వచ్చిన వ్యక్తులు తమ మాటలు,చేతల చాకచక్యంతో ముందు వాళ్ళ కంటే తామే గొప్పనే భ్రమను కల్పిస్తుంటారన్న మాట.అది తెలియక ఆ చతురత కలిగిన వారిని గొప్పగా చూడటం మొదలుపెడుతుంటారు.అదిగో అలాంటప్పుడే "ముందొచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి " అనే న్యాయమును ఏహ్యభావం రంగరించి ఉదాహరణగా చెప్పడం చూస్తుంటాం.
అయితే ఇందులో కొందరు వ్యక్తులు మాత్రం మొదటి వ్యక్తులపై ఉన్న వ్యక్తిగత కక్షతో కూడా ఇలా కావాలనే చేయడం చూస్తూ ఉంటాం.
ఇలాంటివి వ్యక్తుల పరంగానే కాకుండా సామాజిక మార్పుల్లో కూడా గమనించవచ్చు.ఒకప్పుడు మానవ సంబంధాలు, మానవీయ బంధాలై అరల్డయిట్ ,క్విక్ ఫిక్స్ కంటే ఎక్కువ బలంగా ఉండేవి.ఉత్తరాలతో హృదయాలను ఆవిష్కరించుకునేవాళ్ళు. కష్ట సుఖాలను కలబోసుకునేందుకు ఒకరి లేఖకై ఒకరు మనసుతో ఎదురు చూసేవారు.
నేడు ఫోన్లు ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత నాటి సంస్కృతికీ,సంప్రదాయాల తిలోదకాలు ఇచ్చాయి.మానవ సంబంధాలు మనసులేని యాంత్రిక బంధాలు అయ్యాయి.
"ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి" అన్నట్లు బంధాలు ,అనుబంధాల్లో, వ్యక్తిత్వాల్లో అనూహ్యమైన మార్పులు తెచ్చాయి.
మనుషుల వ్యక్తిత్వాలలో మంచి చెడుల మధ్య ఉన్న వ్యత్యాసం చెప్పేందుకే కాకుండా మానవ సంబంధాల గురించి చెప్పేందుకు కూడా ఈ "శ్రోత్ర శృంగ న్యాయము" సరిగ్గా సరిపోతుంది కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి