:- ఓ.... జాతి పితా.... !- .. కోరాడ నరసింహా రావు... !

 పల్లవి :-
     ఓ.... జాతి పితా...... !
మహాత్మా.....మా గాంధీతాతా!!
  చూసావా... నీ స్వతంత్ర భారత దేశం.... !
..ప్రతి ఒకరిలో... ప్రబలిపోయినస్వార్ధం !! 
  రగిలిపోతున్న నీ భారతదేశం !
  .... రగిలిపోతున్న నీ భారత దేశం.. !! 
         "ఓ... జాతి పితా.... !"
చరణం :-
 నేడు అన్యాయం - అక్రమం... 
   విశృంఖలం...,
    ప్రబలిపోతున్న అసమానతలస్వైర విహారం ..!
     "నేడు  అన్యాయం -... !"
చూసావా నీ స్వతంత్ర భారతదేశం... 
  చూసావా నీ స్వతంత్ర భారత దేశం.... !!
      " ఓ... జాతి పితా...... ! "
చరణం :-
సత్యమహింసల బాణం పట్టిన శ్రీరాముడె నీవు... !
 స్వరాజ్య సముపార్జనకై... 
  చక్రం తిప్పిన శ్రీకృష్ణుడవే నీవు 
     నేడు  సత్యమహింసల సత్యాగ్రహములు కాదు...., 
   శిల గా నిలిచిన నీవు... 
  కలియుగ * కల్కి* వయి  రావాలి !
 నువు కలలు గన్న భారతాన్నే తేవాలి !
  నువ్ కలలు గన్న భారతాన్నే తేవాలి !!... నువ్వే తేవాలీ !!!
       ******
కామెంట్‌లు