ఉమా-1
కోపము శాపమైవరలు*
కోమలమానసమందుతాపమై!
కోపమునాక్షణమ్మునను*
కొంచెమునాపినబాధదూరమౌ!
కోపము ముక్కుపై ననెడు
కూర్మినినానుడిమార్చగావలెన్!
కోపముమానవాళికి,ని
గూఢితమౌ పతనంపు హేతువే!
ఉమా-2
కోపము క్రోధమై మనిషి*
కున్నటువంటిదురాగతమ్ముగా!
ప్రాపును వీడుశత్రువుగ*
భావనలోపలనెక్కిపారగా!
కోపము మాంద్యమై మనుజ*
కోటిని పీల్చుచు పిప్పిచేయుచున్!
కోపముమానవాళికి,ని
గూఢితమౌ పతనంపు హేతువే!
ఉమా-3
కోపమువచ్చునాక్షణము*
గోడలు,గుంజలు లెక్కపెట్టుచున్!
తాపమునందకుండినను*
తక్షణ శాంతియు చేకురున్గదా!
లోపమునెంచిమార్పుగన*
రోషముతగ్గువిచక్షణాంగమై!
కోపము మానవాళికి,ని
గూఢితమౌ పతనంపు హేతువే!
ఉమా-4
కోపమశేషదుఃఖముల*
గూడుగ మానవ దేహమందునన్!
యేపదిసంచరించుచును*
యేర్పడకుండువిరాజమానమై!
సోపతి యౌనునాపదల*
జోరునపైకెగబ్రాకిపొంగుచున్!
కోపముమానవాళికి,ని
గూఢితమౌ పతనంపు హేతువే!
ఉమా-5
కోపము చల్లఁబర్చుటకు*
కోవెలలోపలశాంతిపూజలున్!
ఓపిక తోడచేయుచును*
ఉత్సవముల్లమునుల్లసిల్లగా!
నీపథమందుమార్పునిడి*
నిశ్చలనిర్మలశాంతిపొందుమా!
కోపముమానవాళికి,ని*
గూఢితమౌపతనంపుహేతువే!
కం-6
కోపముననుమానమ్ములు
ప్రాపుగనేవిషయములను*
పాలనగనకన్!
యేపథివాటినివీడగ
యేపుననానందమయము*
నీజీవితమున్!
కం-7
అనుమానముకనినంతనె
చనుమాయచ్చోటువీడి*
సన్మార్గమునన్!
తన,మన,జనులనియెంచక
అనుమతిలేకున్నఁజనిన*
యానందమ్మౌ!
కం-8
ఆనుమానముపెనుభూతము
మనమునదినదినముపెంచ*
మదిచెడిపోవున్!
కనుగొన దానికివిరుగుడు
హనుమంతునితలచినంత*
నాత్మకుతృప్తిన్!
కం-9
భగవన్నామముమననము
బుగులునుపోద్రోలుచుండి*
పుణ్యములొసగున్!
జగమెరిగిన సత్యమ్మిది
నగణితమౌనౌషధమ్ము*
నరులకు మదిలో!
కం-10
భుగభుగమనిబుసకొట్టెడు
ద్విగుణీకృతకోపతాప*
దిశమార్చుచునే!
యగణితమనుమానమువిడ
సుగుణము,శాంతియును పొంది*
శుభములు కలుగున్!
**🙏🌹🙏**
మాడుగులమురళీధరశర్మ
కోపము శాపమైవరలు*
కోమలమానసమందుతాపమై!
కోపమునాక్షణమ్మునను*
కొంచెమునాపినబాధదూరమౌ!
కోపము ముక్కుపై ననెడు
కూర్మినినానుడిమార్చగావలెన్!
కోపముమానవాళికి,ని
గూఢితమౌ పతనంపు హేతువే!
ఉమా-2
కోపము క్రోధమై మనిషి*
కున్నటువంటిదురాగతమ్ముగా!
ప్రాపును వీడుశత్రువుగ*
భావనలోపలనెక్కిపారగా!
కోపము మాంద్యమై మనుజ*
కోటిని పీల్చుచు పిప్పిచేయుచున్!
కోపముమానవాళికి,ని
గూఢితమౌ పతనంపు హేతువే!
ఉమా-3
కోపమువచ్చునాక్షణము*
గోడలు,గుంజలు లెక్కపెట్టుచున్!
తాపమునందకుండినను*
తక్షణ శాంతియు చేకురున్గదా!
లోపమునెంచిమార్పుగన*
రోషముతగ్గువిచక్షణాంగమై!
కోపము మానవాళికి,ని
గూఢితమౌ పతనంపు హేతువే!
ఉమా-4
కోపమశేషదుఃఖముల*
గూడుగ మానవ దేహమందునన్!
యేపదిసంచరించుచును*
యేర్పడకుండువిరాజమానమై!
సోపతి యౌనునాపదల*
జోరునపైకెగబ్రాకిపొంగుచున్!
కోపముమానవాళికి,ని
గూఢితమౌ పతనంపు హేతువే!
ఉమా-5
కోపము చల్లఁబర్చుటకు*
కోవెలలోపలశాంతిపూజలున్!
ఓపిక తోడచేయుచును*
ఉత్సవముల్లమునుల్లసిల్లగా!
నీపథమందుమార్పునిడి*
నిశ్చలనిర్మలశాంతిపొందుమా!
కోపముమానవాళికి,ని*
గూఢితమౌపతనంపుహేతువే!
కం-6
కోపముననుమానమ్ములు
ప్రాపుగనేవిషయములను*
పాలనగనకన్!
యేపథివాటినివీడగ
యేపుననానందమయము*
నీజీవితమున్!
కం-7
అనుమానముకనినంతనె
చనుమాయచ్చోటువీడి*
సన్మార్గమునన్!
తన,మన,జనులనియెంచక
అనుమతిలేకున్నఁజనిన*
యానందమ్మౌ!
కం-8
ఆనుమానముపెనుభూతము
మనమునదినదినముపెంచ*
మదిచెడిపోవున్!
కనుగొన దానికివిరుగుడు
హనుమంతునితలచినంత*
నాత్మకుతృప్తిన్!
కం-9
భగవన్నామముమననము
బుగులునుపోద్రోలుచుండి*
పుణ్యములొసగున్!
జగమెరిగిన సత్యమ్మిది
నగణితమౌనౌషధమ్ము*
నరులకు మదిలో!
కం-10
భుగభుగమనిబుసకొట్టెడు
ద్విగుణీకృతకోపతాప*
దిశమార్చుచునే!
యగణితమనుమానమువిడ
సుగుణము,శాంతియును పొంది*
శుభములు కలుగున్!
**🙏🌹🙏**
మాడుగులమురళీధరశర్మ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి