సుప్రభాత కవిత ; - బృంద
చెప్పలేని మమతలేవో
విప్పలేని మూటలా
కప్పుకున్న పొరలన్నీ
తప్పుకున్న వేళ

నదీకన్యక నుదుట తిలకమై దినకరుని ప్రతిబింబం
మది దోచిన నదికి రవి ఇచ్చిన
అందమైన బహుమానం

సుందర కమనీయ దృశ్యం
చూసి ఓర్వలేక
కినుకతో ఎరుపెక్కిన
మరుగే లేని గగనం

మదిగదిలో దాచిన మౌనం
ఎద తడిలో దాగిన  మమత
అది మనసుకే  తెలిసిన సత్యం 

తుదిలేని అనుభూతుల పొట్లం

పొగడ్తలు భాష కందని భావనగా
రాగమెరుగని గానంగా
ముగిసిపోని ఆమనిగా
ఎగిసిపడని  అలలుగా

హృదయాంతరాళాన
వినిపించే సవ్వడులు
గమనానికి తోడొచ్చే
అడుగుల సిరిమువ్వలు

పవళించిన  మనసులను
పలుకరించే ప్రియ నేస్తానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు