నాణ్యమైన విద్య విషయంలో మన దేశం ఇంకా అభివృద్ధి చెజందిన దేశాలతో పోలిస్తే వెనుకబడే వుందని చెప్పవచ్చు. ఆర్ధిక ఇబ్బందులతో చదువులకు దూరం కావడం గ్రామీణ ప్రాంతాలలో ఇంకా మన ముంది ఆవిష్కృతమౌతున్న దృశ్యం.. కేరళలో విద్యారంగానికి 40% బడ్జెట్ కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో కేవలం 10% బడ్జెట్ కేటాయిస్తుండడం దురదృష్టకరం. కేరళలో మూడు కోట్ల జనాభాకు 1500 ప్రభుత్వ కళాశాలలు ఉండగా మన రాష్ట్రంలో ఎనిమిది కోట్ల జనాభాకు కేవలం 1700 ప్రభుత్వ కళాశాలలు ఉండడం దురదృష్టకరం. అమెరికాలో ముప్పై కోట్ల జనాభాకు 2500 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండగా, మన దేశంలో 300 ప్రభుత్వ విశ్వవిద్యాలయలు మాత్రమే ఉన్నాయి.విద్య అంటే ‘మంచి అలవాట్లను నేర్పించడమే’ అని స్వామి వివేకానంద పేర్కొనడం జరిగింది. విద్యాబోధనలో నైతిక విలువలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నైతిక విలువలను పెంపొందించడానికి అన్ని పాఠశాలల్లో, గ్రంధాలయాలు ఏర్పర్చడం అత్యంత ఆవశ్యకం. 1986, జాతీయ విద్యావిధానం విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. 2వ తరగతి నుంచి నైతిక విలువల బోధనకు ఒక పీరియడ్‌ను కేటాయించాల్సిన అవసరమున్నది.డిజిటల్ విద్యాబోధన తన పరిధిని పెంచుకుంటున్న నేపధ్యంలో పుస్తక పఠన నేటి యువతలో పెంపొందించాల్సిన అవసరం ఎంతో వుంది.మనదేశంలో మాత్రం ప్రాధమిక విద్యలో మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీషు లతో పాటు మార్కులు ఎక్కువగా రావాలన్న ఉద్దేశంతో జర్మన్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలను కూడా ప్రోత్సహిస్తున్నారు. వీటిని కూడా బోధిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర వత్తిడికి గురవుతున్నారు. ‘చైనా, రష్యా, జపాన్, జర్మనీ’ వంటి దేశాలలో విద్యాబోధన అన్ని స్థాయిలో మాతృభాషలో జరుగుతుంటే, మనదేశంలో మాత్రం ప్రాధమిక స్థాయి నుండి ఉన్నతవిద్య పూర్తిగా ఆంగ్లమాద్య మంలో జరుగుతుండడంతో విద్యార్ధులు తీవ్ర వత్తిడికి గురయ్యి, చదువులో వెనుకబడు తున్నారు. తద్వారా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్ధులు అధిక సంఖ్యలో ఆత్మహత్మలకు పాల్పడుతున్నారు. ఆంగ్లమాధ్యమం ద్వారానే అభివృద్ధి సాధ్యమని మన ప్రభుత్వాలు భావిస్తుండడం దురదృష్టకరం. మాతృభాషలో విద్యాబోధన జరుపుతున్న (అన్ని స్థాయిల్లో) చైనా, రష్యా వంటి దేశాలు అగ్రరాజ్యాలుగా కొనసాగు తున్నాయి.మార్కులు, రాంకులు, పెర్సెంటేజిల సాధనే ధ్యేయంగా కాకుండా విద్యార్ధుల మేధో వికాసమే లక్ష్యంగా మన విద్యా విధానాన్ని తీర్చిదిద్దాలి.
విద్యార్థుల మేధో వికాసం;- సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి