* నిజ కవి *
***
వీడు వ్రాసింది....
మీకు నచ్చితే... సంతోషమే
గానీ..కేవలం, మీకు నచ్చాలని...
మీరు మెచ్చాలని...
వీడెప్పుడూ... వ్రాయడు !
******
@ కవిత్వమంటే.... !
*****
యతులు - ప్రాసలు....
గణాలు - వృత్తాలు....
కేవల అలంకారాలు కాదు !
అది, హృదయ స్పందనలకు
ఆత్మ కళాత్మక ప్రతిస్పందన!!
******
@ కవిత్వార్థపరమార్ధం ... !
****
కర్త, శ్రోత...
ఇరువురినీ రంజింపజేసి...
అలౌకికానంద పారవశ్యంలో
ఓల లాడించ గలిగటమే .....
నిజమైన కవిత్వానికర్ధం !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి