ఆత్మ ప్రదక్షిణ; - సి.హెచ్.ప్రతాప్
 శ్లో ::  యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ

ఆత్మలో ఉన్న పరమాత్మకు మనం చేసే ప్రదక్షిణకే ఆత్మ ప్రదక్షిణ అని శాస్త్రం నిర్వచిస్తోంది.ప్రదిక్షణ ఎలా చేయాలనే దానిపై   స్పష్టమైన నిబంధనలు వున్నాయి. ప్రదక్షిణ ఎప్పుడూ కుడి నుంచి ఎడమవైపునకు తిరుగుతూ చేయాలి. ఆలయంలో ప్రదక్షిణ చేసినప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ఆలయాన్ని చుట్టి రావాలి. మన ఎదురుగా ప్రతిమగానీ, అర్చామూర్తిగానీ లేనప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేయాలి.మంచి ఆలోచనలతోనే ప్రదక్షిణ చేయాలి. పూజా సమయంలో చివరగా ‘మంత్రహీనం క్రియాహీనం..’ అనే శ్లోకాన్ని చెప్పి, ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి అంటూ . చేయమని శాస్త్రం చెబుతోంది. అత్మ ప్రదక్షిణ అంటే మనకు మనం ప్రదక్షిణం చేసుకోవడం కాదు. మనలోని భగవంతునికి నమస్కరించడం అని గుర్తించాలి. సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ ఫలితంగా జీవరాశి మనుగడకు శక్తి లభిస్తోంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్టే, ఆత్మ ప్రదక్షిణ, విగ్రహం చుట్టూ తిరగడంలోనూ ఇదే ఆంతర్యం దాగి ఉంది. ఈ ప్రదక్షిణల వల్ల మనిషి ఙ్ఞానానికి అతీతమైన శక్తిని దైవం నుంచి పొందుతాడు. శరీరానికి, మనసుకు ఎంతో మేలు జరుగుతుంది.  అన్ని రూపాలకు కదలని కేంద్రమైన భగవంతుని చుట్టూ వేలాది విశ్వాలు తిరుగుతున్న ధ్యానమే నిజమైన ప్రదక్షిణ.ప్రతి ప్రదక్షిణతో ఈ జన్మలో మరియు పూర్వ జన్మలలో చేసిన ఆ తప్పిదాలు మరియు కమీషన్లు మరియు వాటి వలన కలిగే బాధలు నశిస్తాయి

కామెంట్‌లు