వానప్రస్థం ఆశ్రమ ధర్మం గృహస్థ ఆశ్రమం తర్వాత సన్యాసాశ్రమం కి ముందు వచ్చేది.వానప్రస్థం అంటే వనాలకి అడివికి వెళ్లి ఉండటం.మనిషి 50ఏళ్ళు రాగానే 25ఏళ్ళపాటు అడవిలో దైవ స్మరణ చేస్తూ కాలం గడపడం అన్నమాట.ప్రపంచసుఖభోగాలంటే విరక్తి చెంది ఒంటరిగా దూరంగా ఉండటం.ఆంగ్లంలో డిటాచ్మెంట్ అంటాం.ప్రాచీనకాలంలో మనిషి 100ఏళ్ళు సునాయాసంగా బ్రతికాడు.రాజులు కూడా కొడుకులకు బాధ్యత అప్పగించి వెళ్లి పోయేవారు.ఆర్యులు ఈవర్ణాశ్రమ ధర్మాలు తు.చ.తప్పక పాటించారు.
వారుణి వరుణుని కుమార్తె.సముద్రమథనంలోంచి బైటికి వచ్చిన ఆమెను దైత్య దానవులు తమతో తీసుకుని వెళ్లారు. వారుణి అనే ఉపనిషద్ విద్య అంటారు.వరుణదేవుడు ప్రసాదించాడు.
వికాసం అంటే వృద్ధి విస్తారం.మస్తిష్క వికాసం అంటే బుద్ధి వికసించటం. కానీ సంస్కృతం లో పూలు వికసించటం అనే అర్థం లో వాడుతున్నాం.వికసతి హి పతంగస్యోదయే పుండరీకం అంటే సూర్యోదయం అవుతూనే తామరపువ్వు వికసిస్తుంది అని అంటారు.భావసదృశం కారణంగా వృద్ధి అనే అర్థం లో వాడుతున్నాం 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి