శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 విగ్నానం అంటే హిందీ లో ఒక విషయం తత్వం సిద్ధాంతం ని సరిగ్గా సంగ్రహించడం అని అర్థం.పదార్ధ శరీర సమాజవిగ్నానం అని ఎన్నో రకాలు.దీని ఇంకో అర్థం కార్యకుశలత కర్మ మాయ అవిద్య మొదలైనవి.సంస్కృతంలో విగ్నానం అంటే గ్నానం అని అర్థం.బుద్ది వివేకం దక్షత కౌశలం లౌకిక గ్నానం పుట్టాయి.వేదాంతంలో ఆత్మ యొక్క పంచకోశాల్లోబుద్ధి విగ్నానం ప్రథమకోశం.అదే విగ్నానమయ కోశం.బౌద్ధం ప్రకారం ఆత్మానుభవం బ్రహ్మ ఆత్మ ఆకాశం నిశ్చయాత్మక బుద్ధి మోక్షం సంగీతం 14విద్యలగ్నానం.చక్షువిగ్నాన్ శ్రోత్ ఘ్రాణ జిహ్వ కాయ మనోవిజ్ఞాన్.బౌద్ధ దర్శనంలో ప్రాణి తల్లి గర్భంలో ప్రవేశించి చైతన్యం పొందడం అనేవిగ్నానవాదం ఉంది.పాశ్చాత్య ఆదర్శవాదం తో పోల్చవచ్చు.గ్నానం కి పరమార్థం సత్! బాహ్య జగత్తుకి కన్పడేవి అన్ని గ్నానం యొక్క ఆకారం.సంస్కృతంలో విగ్నానం అంటే సంగీతం 14విద్యలు.సుశృతసంహితలోస్థావర విషవిగ్నానీయమధ్యాయమ్! కానీ నేడు విగ్నానం అంటే సైన్స్ అనే అర్థం లో వాడుతున్నాం.మరాఠీ గుజరాతీ బెంగాలీ కన్నడ మలయాళం లో విగ్నానం అంటే సైన్స్ అనే అర్థం లో వాడుతున్నారు🌹
కామెంట్‌లు