పువ్వుల పండుగ(బాల గేయం)- ఎడ్ల లక్ష్మి
పూల పండుగ వచ్చింది
పుడమి తల్లి మురిసింది
పడతులంతా వచ్చారు
పూలు అన్ని పెంచారు

బుట్టల నిండా నింపారు
ఇంటికి వారు తెచ్చారు
గుమ్మడి పూలు తెంచారు
గుమ్మడి ఆకులు తెచ్చారు

రాగి పల్లెరం తెచ్చారు
గుమ్మడి ఆకులు వేశారు
పువ్వులు అన్నీ ఏరారు
క్రమ వారసలో పేర్చారు

చిక్కుడాకులు తెంచారు
బతకమ్మ మీద పెట్టారు
పసుపు గౌరిని చేశారు
కుంకుమ బొట్టు పెట్టారు

రంగురంగుల పూలు వేసి
చేతులెత్తి మొక్కారు
బతుకమ్మ పాట పాడుతూ
పిల్లలు పెద్దలు ఆడారు

తొమ్మిది రోజులు వారం
ఆడుతూ పాడుతూ వారంతా
చెరువు వద్దకు చేరారు
గౌరీని గంగకు చేర్చారు


కామెంట్‌లు