దైవం మానుష్య రూపేణా- సి.హెచ్.ప్రతాప్

 మనకి డబ్బు ఎక్కువుగా ఉన్నప్పుడు మన దగ్గరఉన్నదాంట్లో కాస్తోకూస్తో సాయం చెయ్యాలి, అది ధర్మం. ఆ ధర్మాన్ని మరిచి మనం జీవితం కొనసాగించాలి అని అనుకొని ఉండటం చాలా తప్పు. ఈ విషయాన్ని ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. డబ్బు మాయలో పడి దైవం మానుష్య రూపేణా అన్న ఆర్యోక్తి మరిచి మనం మసులుతున్నాము. లోకంలో డబ్బే అన్ని అనర్ధాలకు దారి తీస్తుంది. ఏదైనా “అంతకుమించి “అనే మాట ఒకటుంది. దాన్ని మార్చపోయి లేని సమస్యలు కొని తెచ్చుకోవడం తప్ప మరొకటిలేదు.
దైవం మానుష రూపేణ’ అన్నది ఒక అద్భుతమైన శాస్త్ర వాక్యం. అంటే ఆ దైవమే మానవాళిని ఉద్ధరించేందుకు మానవుల రూపంలో వస్తాడు అని అర్ధం. అంటే దైవం ఎక్కడో లేదు.మనిషి రూపంలో మన దగ్గరే ఉందని అర్థం. మరి ఆ దైవస్వరూపం ఎవరు అంటే మొదటగా మనల్ని నవమాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి, రెండోది ఈ భౌతిక శరీరధారణకు కారణమైన తండ్రి, మూడోది మన చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానమనే చీకట్లు తొలగించే గురువు. నాలుగోది సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం...అతిథి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మన సనాతన ధర్మం నినదిస్తుంది. వీరిని పవిత్ర హృదయంతో ఆరాధించడం అవశ్యం.వీరితో పాటు ఒక్కొక్కసారి భగవంతుడు ఆపత్సమయాలలో స్నేహితులు, హితులు, సన్నిహితుల రూపంలో కూడా పంపించవచ్చు. అందుకే ఎవరైనా, ఏ చిన్నపాటి సహాయం అందించినా దానిని భగవత్ప్రసాదమని భావించాలి. 
కామెంట్‌లు