ఆదిమానవుల ఆయుధాలవి రాయి,.... కర్రలే... !
ఇనుమును కనుగొన, ఆయుధాలనేకములైనవీ !!
మనిషి సాధించు అనేక ఘనకార్యములలో ప్రధానమైనవి ఆయుధమ్ములే !
కత్తి, బల్లెము,గొడ్డలి,బాణము
పురాణ కాలపు ఆయుధమ్ములివె !
శ్రీకృష్ణుని ఆయుధము చక్రము
అర్జునునిది బాణము !
భీముని ఆయుధము గద...
పరశురాముడుడు వాడెను గొడ్డలి !
శత్రువులతో పోరులో...
సాధారణముగ అందరి ఆయుధములు కత్తి, డాలు, బల్లెములే... !
రావణుని శ్రీ రాముడును...
మహిషాసురుని భద్రకాళియు
సంహరించినది, విజయ దశమి నాదే.... !
చేపట్టిన ఆయుధమునకు...
విజయమును చేకూరినది
ఆశ్వయుజ దశమి తిధి నాడే !
ఈ నవీన సమా జములో....
జీవనమే ఒక సమరమాయెను
వృత్తి పనిముట్లే ఆయుధమ్ములు !
నాగలి, కొడవలి,...సుత్తి, సేనం
గునపం, పార... వృత్తి పరికరములే దివ్యాస్త్రశస్త్రాలు
జీవనోపాధికై చేయుపనిలోన...
విజయము కాంక్షిస్తూ...
ఈ విజయ దశమినాడు
పనిముట్లను మన ఆయుధములకుపూజలు చేయుదము, మనము పూజించుకొందుము !
చేయు పనులకు సత్ఫలితములను పొందినట్లుగా... మనల ననుగ్ర హింపు మని
ఆ జగజ్జననిని ప్రార్ధించుచు !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి