గోపబాలుడు;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 మత్తకోకిల/
గోపబాలుడు జన్మనొందెను గోకులంబున శూరుడై
దీపమై వెలుగొంది నాడిల ధీరుడై జగమేలగన్
గాపు గాయుచు భక్తకోటిని కామితంబులు తీర్చగన్
బాపరాసులు దగ్ధమౌకద బాల కృష్ణుని మ్రొక్కగన్.//
మత్తకోకిల /


పాపి కంసుని సంహరించిన బాలుడీతని నామమున్
దాపసుల్ కడు భక్తిమీరగ తల్చుచుందురు నిత్యమున్
దాప మంతయు దొల్గ జేయుచు ధర్మమార్గము చూపునా
శ్రీపతిన్ మది యందు నిల్పిన చేర వచ్చును బంధువై //
ధ్రువకోకిల /
పరమపావనమూర్తి పాదము పట్టికొల్చిన శ్రద్ధగన్
దొరకునాపరమాత్మ సన్నిధి దోషముల్ నశియించగన్
జిరయశంబును కల్గి భక్తులు చేరుకొందురు మోక్షమున్
తరలి రండిటు!బాల కృష్ణుని దర్శనంబును కోరుచున్.//
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం