హైకూలు;- సుమ కైకాల
1. హరితవర్ణం
    ఆహ్లాదం నింపుతోంది
    ప్రకృతి కాంత!...

2. చుక్కల చీర
    చీకట్లో మెరుస్తోంది
    ఆకాశ వీధి!...

3. ఉద్యాన వనం
    శోభాయమానమేగా
    రంగుల పూలు!...

4. నింగి నవ్వింది
    ఆనంద భాష్పాలుగా
    వాన జల్లులు!...

5. మోడు వారింది
    కొత్త చిగుర్ల కోసం
    ఎదురు చూస్తూ!...
కామెంట్‌లు