న్యాయాలు -293
శ్వ పిశున న్యాయము
*****
శ్వ అంటే శునకము లేదా కుక్క. పిశున అంటే నీచము, దుష్టము, ద్రోహము గల వాడు,కొండెములు చెప్పువాడు, కుంకుమ పువ్వు, నారదుడు, కాకి, చాడీ కోరు ,తంటాల మారి అనే అనేక అర్థాలు ఉన్నాయి.
కొండేకాడికి,కుక్కకు అట్టే భేదము లేదు. ద్రోహ బుద్ధి ,నీచ గుణము కలవానికీ,కుక్కకు స్థిరమైన మంచి బుద్ధి ఉండదు. ఇతరులంటే సరిపడదు .
అందుకే లోభిని, నీచ గుణము కలవానిని "గడ్డి వాము దగ్గర కుక్క " అంటారు.
గడ్డివాము దగ్గర కుక్క తాను గడ్డి తినదు.కానీ ఇతరులనూ తిననీయదు.
ఇలా తాను తినకుండా ఇతరులకు పెట్టకుండా లోభత్వము, నీచత్వము, దుష్టత్వము ప్రదర్శించే వ్యక్తులను ఉద్దేశించి వారి బుద్ధి కుక్క బుద్ధితో పోలుస్తూ ఈ "శ్వ పిశున న్యాయము" ను ఉదాహరణగా చెబుతుంటారు.
భాస్కర శతక కర్త ఇలాంటి వారిని ఉద్దేశించి చెప్పిన పద్యాన్ని చూద్దామా...
"అతి గుణ హీన లోభికి బదార్థము గల్గిన లేక యుండినన్/మితముగ గాని కల్మిగల మీదట నైన భుజింప డింపుగా/ సతమని నమ్ము దేహమును సంపద, నేరులు నిండి పాఱినన్/గతుగక జూచు గుక్క దన కట్టడ మీఱక యెందు భాస్కరా!"
అంటే లోభి, నీచుడు తన శరీరము, సంపద శాశ్వతమనుకొని కడుపు నిండా తినకుండా మితంగా తింటాడు.నది నిండా నీరు పారుతున్నా కుక్క నాలికతో గతుకుతుందే కానీ మంచిగా తాగదు కదా! అలాగే.లోభి కూడా కుక్కలాంటి వాడేనని అర్థము.
ఇలాంటి దూర్త లక్షణాలు కలిగిన వ్యక్తుల గురించి దూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకములోని పద్యాన్ని చూద్దాం.
'జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుటన్యాయ వి/ ఖ్యాతిం బొందుట కొండె కాడవుట హింసారంభకుంఢౌట మి/థ్యా తాత్పర్యములాడుటన్నియు బర ద్రవ్యంబు నాశించి యీ/ శ్రీ తా నెన్ని యుగంబు లుండ గలదో శ్రీ కాళహస్తీశ్వరా!
అనగా భవిష్యత్తు చెప్పుట,ఇతరుల సేవ చేయుట,అసత్యములను పలుకుట,అన్యాయములు ఆచరిస్తూ ఆ విషయమున పేరు పొందుటయు, చాడీలు చెప్పుట, ప్రాణ హింస చేయుట, అబద్ధాలను ఇతరులకు బోధించడం, ప్రచారం చేయడం లాంటివన్నీ ఇతరుల ధనం ఆశించవలెనన్న ఆశతోనే కదా! ఈ విధంగా అధర్మముతో సంపాదించేది ఎంత కాలము వుంటుంది? అంటే ఎల్లకాలం వుండదు అని అర్థం.
మనిషి మనిషిగా మంచితనం ,పరోపకారంతో బ్రతకాలి కానీ ఇలా కుక్కలాగానో, లోభిగానో జీవించ కూడదు.కొండేలు చెప్పి పబ్బం గడుపుకో కూడదని ఈ "శ్వ పిశున న్యాయము" లోని అంతరార్థం. కాబట్టి మనం అలా కాకుండా మంచికి,మానవతకు మారు పేరుగా జీవిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి