ఆహరం ;-... కోరాడ. అరసింహా రావు !
కేవలం... ఆ... అని నోటిలోకి పంపే.... పదార్ధాలే ఆహారం.. !
  ఆహారమంటే కేవలం కడుపునింపుకోటానికి తినేదే, 
.  అనుకుంటే పొరపాటే... !

పరమాత్మ ప్రసాదితమీ ఆహారం !
   పరబ్రహ్మ  స్వరూపం... 
   సాక్షాధామృతం... 
  ఆరోగ్య, జ్ఞాన, ఐశ్వర్య ప్రదాయికం... !!

  అంతే కాదు... 
    ఆహారం పంచభూతాత్మకం!
      దివ్యౌషధం.. !

  ఆహారం మన గర్భకోశమున చేరి... జఠరాగ్ని చే పచనం కాబడి...., 
     అందులోని దివ్య సారమంతా.... రక్తముగా మారి 
. మనకు శక్తిని ఇవ్వటంతో పాటు...., 
    ఆ రక్తములో విశిష్ట శక్తి పదార్థమే.... ఇంద్రియమై.... 
   మన జన్మలకు కారణ భూత మగుచున్నది !

మనబుద్ది, మన మాట, మన ప్రవర్తన... ఇవన్నియూ... 
  మనము తీసుకునే ఆహారము పైనే, ఆధారపడియున్నవి !

అందుకే... "తిండి ఎట్టిదో - త్రే పు  అట్టిదని మన సత్యసాయి అంటుంటారు...!

ఆహారము సాధారణము గా... 
సాత్విక, రాజస, తామసములను... 
   మూడు విధములు !
 సత్వ, రజస్తమో గుణములకు 
 పై ఆహారములే కారణమగుచున్నవి ! 

పరిశుద్ధ ఆహారము ఆరోగ్యమునకు, ఆనందమునకు, కారణమగునటులే... 
   కలుషితాహారము, అనారోగ్యమునకు, దుఃఖ బాధలకు కారణములు !!

ఆహారమును వినయ, విధేయతలతోను, భక్తి, శ్రద్ధలతోనూ భుజించువారికి 
    ఆ ఆహారమే అమృతము !

పరమ పవిత్రమైన ఇట్టి ఆహారమును కలుషితము చేయరాదు... !
    కడుపుకింత కూడు దొరకక అలమటించువారెందరో... 
   కావున ఆహారమును వృధా చేయరాదు..., పారపోయరాదు 

ఈ ప్రపంచమున ఆకలికి అలమ టించువారు లేని రోజుననే... మనకు నిజమైన ఆహార దినోత్సవము !!
     ******


కామెంట్‌లు