మనోనేత్రం.(బాలపంచపదులు )- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 1.
పంచేద్రియాణాం నయనం ప్రధానము
విశ్వాన్ని ఉత్సాహంగా వీక్షించటము
సత్యాసత్యం నిర్ధారించుకోవటము
సంయమనంతో సాగునీ ప్రయాణము
జ్ఞానదృష్టి మనకావశ్యకం జయ!//
2.
దృష్టిలోపం మిగుల్చునంధకారము
అడుగేయాలంటేనే బహుకష్టము
తోడులేక సాగలేదీ దౌర్భాగ్యము
అంగవిహీనం ఘోరమైనశాపము
జ్ఞానదృష్టి మనకావశ్యకం జయ!//
3.
అంధులకు వలసినంత సాయము
చేసిచూపవోయ్ నీదు మమకారము
ధైర్యంతో దారిచూపుటే ఔదార్యము
సౌకర్యాలు కల్గించుటే సౌహార్ద్రము
జ్ఞానదృష్టి మనకావశ్యకం జయ!//
4.
మనుషులక్కావాలి మనోనేత్రము
అంతర్నేత్రంతో గాంచగా నాదైవము
చరించు నీ తోడునీడై నిరతము
త్రినేత్రం చూపించునా ముక్తి మార్గము
జ్ఞానదృష్టి మనకావశ్యకం జయ!//

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం