వనయం అంటే ఆత్మ సంయమనం సదాచారం.విద్యా దదాతి వినయం వినయాద్ యాతి పాత్రతామ్.ఇందులో కూడా వినయం అంటే సదాచార ప్రాప్తి అనే అర్థం ఉంది.బౌద్ధసాహిత్యంలోకూడా ఇదే అర్థం.బౌద్ధధర్మంలో ధర్మగ్రంధంత్రిపిటక లో ఒక భాగం వినయపిటక్ లో కూడా ఇదే అర్థం చెప్పారు.కాలాంతరంలో వినయం అంటే నమ్రత అనే అర్థం స్థిరపడింది.
విరహ్ అని హిందీలో అర్థం వస్తువు నుండి రహితం . కానీ నేడు ప్రియమైన వ్యక్తి నించి దూరం కావడం అనే అర్థం లో వాడుతున్నాం.పతి పత్ని ప్రేయసి ప్రియులు దూరప్రాంతాల లో ఉండటం ని కవులు వర్ణించారు.భవబంధనం ప్రకారం 6రకాల విరహాలున్నాయి.ప్రారంభ క్షణిక వాగ్మయ పరోక్ష ప్రత్యక్ష చిర విరహాలు! విరహా పదం వచ్చింది.బఘేలీ అవధీ భాషల్లో వియోగం గీతాలను విరహా అంటారు.విరహీ విరహిణి విరహాగ్ని విరహవేదన
విరహనివేదన అనే పదాలు వచ్చాయి.🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి