న్యాయాలు -286
శృంగ గ్రాహికా న్యాయము
*****
శృంగ అంటే శిఖరము, కొమ్ము,భవనాగ్రము అనే అర్థాలు ఉన్నాయి.గ్రాహికా అంటే పట్టుకొనుట,పట్టుకొను వాడు.
శృంగ గ్రాహికా అనగా కొమ్ములు పట్టుకొనుట. ఓ యజమాని పశువుల కాసే కాపరిని తనకు సంబంధించిన ఆవు ఏదని అడిగితే ఆ కాపరి మందలోంచి ఓ ఆవు కొమ్ములు చూపి "ఇదే మీ ఆవు" అని చెప్పాడట.
దీనిని బట్టి ఆ గోవుల కాపరి ఎంత గడసరినో అర్థమవుతుంది. ఆ ఆవు వుందో లేదో తెలియదు.దానిని ఉన్నట్టుగా చూపడమంటే యజమానిని మభ్యపెట్టడమే.లోలోపల వేరే ఉద్దేశం పెట్టుకుని పైకి ఆ భావం కనబడకుండా,విషయమేమిటో తెలియకుండా, అర్థం కాకుండా మాట్లాడటం అంటే ఇదే.
దీనినే తెలుగు సామెతల్లో"కొమ్ములు చూపి బేరమాడినట్లు" అని అంటారు.
విషయం అంతటినీ బయట పెట్టకుండా,తెలియనీయకుండా మర్మగర్భంగా చెప్పేవారిని ఉద్దేశించి ఈ "శృంగ గ్రాహికా న్యాయము" ను ఉదాహరణగా చెబుతుంటారు.
సాధారణంగా ఇతరులను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తూ ఉంటారు.తమ ఆంతర్యం తెలియకుండా యుక్తిగా మాట్లాడుతూ ఉంటారు.
అయితే దీనికి దగ్గరి అర్థం వచ్చేలా మహాభారతంలో ఓ ఘటన వుంది చూద్దామా మరి...
ధృతరాష్ట్రుడు ఓ రోజు పాండవులను, కుంతీదేవిని పిలిచి గంగా పుష్కరాల యాత్రకు వెళ్ళమని చెబుతాడు. ధృతరాష్ట్రుడి దుష్టమైన ఆంతర్యం తెలియని పాండవులు,కుంతీ దేవి ఆనందంగా బయలుదేరుతారు.
ఇక్కడ దృతరాష్ట్రుడు చేసింది ఏమిటంటే పుష్కరాల యాత్ర వల్ల పుణ్యం వస్తుందనే ఉద్దేశం కలిగేలా మభ్యపెట్టాడు. కానీ వాళ్ళకు పుణ్యం రావాలని మాత్రం కాదు.
ఓ నెపం చూపించి వారికి హానికలిగించాలనే కోరిక తోనే అలా చేశాడు. ఇలా ఉద్దేశ్య పూర్వకంగా చేసే వారు తాము చేసేది ఎవరూ గుర్తించరు అనుకుంటారు కానీ , అది ఏదో విధంగా తెలిసిపోతూనే వుంటుంది.
కొమ్ములు చూపి బేరమాడినట్లయినా, గంగా పుష్కరాలకు దృతరాష్ట్రుడు పంపడమయినా కారణం ఒకటే... కాబట్టి ఇలాంటి వారి పట్ల సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలన్నదే ఇందులోని అంతరార్థం.
ఈ "శృంగ గ్రాహికా న్యాయము" ద్వారా ఇలాంటివి ముందే గ్రహించి అప్రమత్తంగా ఉందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి