మస్కట్ విశేషాలు.. సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆమె పెద్దగా చదువుకోలేదు.ఐదో క్లాస్ పాసైన ఆమె ఆర్థికంగా దెబ్బతినడంతో ఒకరి సాయంతో మస్కట్ లో హౌస్ కీపర్ గా పనిచేస్తూ కొనుగోలు సెలవుపై ఇండియా వచ్చారు.నేను అడిగితెలుసుకున్న విషయాలు ఇవి..అక్కడి భాష అరబిక్.ఆంగ్లం కూడా మాట్లాడుతారు.తెలుగువారు కేరళ వారు రకరకాల వృత్తుల్లో స్థిరపడ్డారు.కేరళవారి షాప్స్ ఎక్కువ ఉంటాయి.ఉదయం 6గంటలకే స్కూల్ బస్సులు వస్తాయి.పొద్దుటే చాయ్ బ్రెడ్ తినేసి పోతారు జాబ్ చేసేఆడవారితోసహా! అక్కడ ఒక రియాల్ అంటే మన 213 రూపాయలకి సమానం.ఒక్కొక్కరి ఇంట్లో 3_4 ఫ్రిజ్ లు ఉంటాయి.కరెంట్ అసలు పోదు.పాలు డబ్బాలో దొరుకుతాయి.బైటకెళ్ళినవారంతా మధ్యాహ్నం రెండు కల్లా ఇంటికొచ్చి భోజనం చేసి హాయిగా పడుకుంటారు.ఒక్కొక్కరి ఇళ్ళల్లో 10 గదులకు తక్కువ ఉండవు.అన్నీ ఎ.సి.గదులే పనివారితో సహా! వేసవి 6నెలలు భరించలేని వేడి.బాస్మతీ రైస్ అన్నంతో పాటు చాలా ఫ్రెష్ గా మనదేశ కూరలన్నీ దొరుకుతాయి.శుక్రవారం సెలవు.ఆదివారం బడి ఆఫీసు ఉంటాయి.ఒక్కొక్క కుటుంబం కి కనీసం 3_4 కార్లు ఉంటాయి.మల్లెపూలతో సహా అన్ని రకాల పూలు దొరుకుతాయి.వారు పూలు పెట్టుకోరు.అన్ని దేశాలవారు పాకిస్థాన్ నేపాల్ తో సహా అంతా కలిసి కట్టుగా ఉంటారు.దొంగతనాలు లేవు.ఎంత రాత్రి ఆడవాళ్ళు తిరిగినా భయంలేదు.రాత్రి 10 దాకా అందరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కల్సుకుని రోజూ కబుర్లు చెప్పుకుంటారు.ఎక్కువగా గాజు పింగాణీ పాత్రలు వాడతారు.ఆఫీసులు కూడా కేవలం మధ్యాహ్నం మూడు దాకానే పనిచేస్తాయి.ఇల్లు పక్కబట్టలు రోజూ శుభ్రం చేసి ఇస్త్రీ చేయాలి.🌹
కామెంట్‌లు