అడవితల్ల్లి;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
రాముడు
వనవాసానికి వెళ్ళినట్టు
నేనూ
అరణ్యవాసానికి వెళ్ల్ళ్లా

అయితే
పెళ్ళాము 
పక్కనాలేదు
తమ్ముడు
తోడుగాలేడు

వెంట
కలాన్ని
తీసుకొని వెళ్ళా
కాగితాలను
పట్టుకొని పోయా

బిక్కుమంటు
కూర్చున్నా
భయపడుతు
చూస్తున్నా

బయటకు
వచ్చా
దృశ్యాలను
చూచా

ఆకాశాన్ని
అర్ధించా
ఆపన్నహస్తాని
అందుకున్నా

చంద్రుడిని
పంపించింది
వెన్నెలని
చల్లించింది

చుక్కలను
చూపింది
స్నేహహస్తమును
చాచింది

చినుకులను
చల్లింది
స్వాగతమును
చెప్పింది

అడవితల్లిని తలచా
ప్రత్యక్షమయ్యింది
చేతులెత్తి నమస్కరించా
ఆహ్వానంపలికింది

పచ్చదనాన్ని
చూపింది
పరవశాన్ని
పంచింది

పెళ్ళికి పేరంటాళ్ళు
పలువురు వచ్చినట్లు
ముచ్చటగా తయారయి
వచ్చాయి వృక్షాలు

కొబ్బరిచెట్టు
నీరిచ్చి త్రాగమంది
కాయలిచ్చి
కొట్టుకొని తినమంది

మామిడిచెట్టు
ఆకులిచ్చి తోరణంకట్టమంది
తియ్యని ఫలాలు
చేతికిచ్చి తినమంది

మర్రిచెట్టు
నీడకురమ్మంది
హాయిగా
నిదురించమన్నది

మల్లెచెట్టు
పూలనుచల్లింది
పరిమళాలను
పీల్చమంది

గులాబిమొగ్గ
సిగ్గులొలికింది
చెంపలనుతాకి
ఎరుపెక్కించింది

మందారాలు
చిలిపిగానవ్వాయి
మకరందాన్ని
క్రోలుకోమన్నాయి

కోకిలమ్మ
వచ్చింది
కమ్మగాపాడింది
నిద్రనూపుచ్చింది

అదృష్టలక్ష్మి
తలుపుతట్టింది
అందాలుచూపింది
ఆనందమునిచ్చింది

కలము
చేతికొచ్చింది
కవితను
సృష్టించింది

అక్షరాలు
అల్లుకున్నాయి
కాగితాలు
కళకళలాడాయి

ఆకాశానికి
వందనాలు
అడవితల్లికి
ప్రణామాలు


కామెంట్‌లు