గలగల శబ్దం చేస్తూ
ప్రవహించే వెన్నెల
నీ నవ్వు
నిశ్శబ్దంగా
కురిసే అమృతం
నీ చూపు
ఆ వెన్నెల్లో,ఆ అమృతంలో
తడిసిపోతూ,కరిగిపోతూ
ఎన్ని యుగాలైనా
ఎన్ని జన్మలైనా
గడిపేయవచ్చు
ఆ వెన్నెల వాకలయ్యే
ఆ నవ్వు
నా సొంతం
ఆ అమృతం నిండిన
ఆ సోగకళ్ళు
నా సొంతం
నేను నిజంగా
అదృష్టవంతుడిని
ప్రేమమూర్తీ!!
*********************************
ప్రేమమూర్తి;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి