విజయదశమి(బాల పంచపదులు )= టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
బ్రహ్మ వర ప్రసాదితుడైనవాడు
లోకకంటకుడు దుష్ట మహిషుడు
దున్నపోతుగా చరించి దొర్లువాడు
జగతినంతయు పీడించె ఖలుడు
సజ్జనాత్ములను హింసించె విజయ.

జగము లన్నియు వణుకు చుండంగా
దేవతాళి బ్రహ్మకడ రోదించంగా
బ్రహ్మదేవుడు వారినూరడించంగా
విష్ణు మహేశ్వరులప్డు ప్రార్థించంగా
సకల జగతి మ్రొక్కంగా విజయ

దేవి యష్టభుజముల ధారిణిగ
జ్యోతి స్వరూపమై యావిర్భవించగ
దేవతాళి యాయుధము లొసగగ
మహిషుని సేన చెదిరి పోవగ
తల్లి మహిషుని మర్దించె విజయ.

ఆశ్వీయుజ శుద్ధదశమి పర్వము
జరుపుకొన్నచో ప్రజకు జయము
కలుగు చుండును నిత్య సౌభాగ్యము
పొరలు చుండ జగతిలో శాంతము
వెలుగు చుండు శాశ్వతమై విజయ.//


కామెంట్‌లు