చీకటి దారిలో దూరపు కొండలో
కనుచూపు మేరలో కనుమలలో
కదిలి వచ్చు కనక కలశమై
వేకువ పువ్వు విరిసేవేళ
పుడమి బుగ్గన పూసే
సిగ్గుల ఎర్రని నిగ్గులన్నీ
హరివిల్లై విరిసెను అవని
ముంగిట అందమైన భావాలై
కొత్తగా పుట్టిన ముచ్చటైన
పుత్తడి నవ్వుల సిరిమువ్వల
ఆనంద తాండవంతో
అవని మారే రంగస్థలమై
అవధిలేని జలధిలాటి
అంబరాన ఆనందపు
తరగలై తిరుగుతున్న
మేఘమాలల సంబరం
గాలితో కలిసి పైరు అడే
సయ్యాటల నాట్యాలు
కనువిందుగ కదిలే
కమనీయ దృశ్యాలు
వెలుగు తెచ్చే ధైర్యం
తొలగు మనసుల భారం
కలుగు నూతన తేజం
కరుగు గమ్యపు దూరం
ఊరించే ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి