రాజాం రచయితల వేదిక సభ్యులు,జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు రచించిన కవిత, చిట్టితల్లీజాగ్రత్త అను సంకలనంలో స్థానం పొందింది.
విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణా సంస్థ ఐన రచనా సమాఖ్య వారిచే ఈ సంకలనం రూపొందినట్లు తిరుమలరావు తెలిపారు. అధ్యక్షులు మింది విజయమోహన రావు ఆధ్వర్యంలో బొబ్బిలి కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో
తనకీ సంకలనాన్ని బహూకరించారని రచయిత తిరుమలరావు తెలిపారు.
ముఖ్య అతిథి
బొబ్బిలి రాజు ఆర్ వి ఎస్ ఎస్ కె కె రంగారావు బేబీ నాయన, సభాధ్యక్షులు ఎమ్.విజయమోహన రావు, రచనా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు, సమాఖ్య ప్రతినిధి టి.వెంకటరమణల చేతులమీదుగా తిరుమలరావు ఈ చిట్టితల్లీజాగ్రత్త సంకలనాన్ని స్వీకరించారు.
జాతీయ స్థాయిలో వచ్చిన కవితలందు వందకు పైగా కవితలను
అధ్యక్షులు మింది విజయమోహన రావు, ప్రధానకార్యదర్శి పి.నాగరాజు, కార్యవర్గ సభ్యులు టి.వెంకటరమణ, పాలక అర్జునుడు, మజ్జి మురళీబాబు, చివుకుల శ్రీలక్ష్మి, రెడ్డి పద్మావతి, దాసరి పద్మ, పల్ల భవాని, కస్తూరి పద్మ, మింది శ్రీనివాసరావుల బృందం ఈ చిట్టితల్లీజాగ్రత్త సంకలనంలో చోటు కల్పించగా, అందులో తన కవిత కూడా ఎంపికైందని తిరుమలరావు ఆనందం వ్యక్తం చేసారు.
ఇప్పటికే ఈ సంస్థ పేరిట అధ్యక్షులు మింది విజయమోహనరావు సంపాదకత్వంలో ఆకుపచ్చని నేస్తం, ప్రాణదాత, జలయజ్ఞం, గురుబ్రహ్మ వంటి సామాజిక స్పృహను ఏర్పర్చేలా గ్రంథాలను వెలువరించగా తన కవితలు మూడు గ్రంథాలలో ముద్రితమైనాయని, ఈ సంకలనంలో "చిన్నారీ మ్రోగించు జయభేరి" అనే తన కవిత ప్రచురణకు నోచుకుందని తిరుమలరావు తెలిపారు.
కీచకపర్వాలకు చరమగీతం పాడేలా తిరుగుబాటు చేయు ఓ ఆడపిల్లా, అత్యాచార పైశాచికత్వాలను పసిగట్టి ఎల్లడలా చితిపేర్చాలి నిలువెల్లా అంటూ ఆయన తన కవితలో విశేషమైన భావాలను చాటిచెప్పారు.
తిరుమలరావు రచన జాతీయ స్థాయి సంకలనాన ఎంపికగుట పట్ల రాజాం రచయితల వేదిక సభ్యులు గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి