కర్ణపేయం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 ఆమె నవ్వు
నడివేసవి వెన్నెల రాత్రుల్లో
జాజిపూలు విరజిమ్మినట్లు
మల్లెతోటలో సుగంధం
నాచుట్టూ ఆవరించినట్లు
వెండివెన్నెల
ఇసుకతిన్నెలమీద నడుస్తున్న
ముగ్ధమోహన పాదాల
అందమైన వెండిపట్టీల సవ్వడిలా
నా
ఆంతర్లోకాల్లో
అప్రమేయంగా
స్వఛ్ఛంగా
గుండెల నిండుగా
కర్ణపేయంగా వినిపిస్తోంది!!
*********************************
.
కామెంట్‌లు