ప్రియతమా;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నాలోన పొంగెనూ 
నవకవిత వెల్లువా 
రసరాగ ఝరిలోన 
రసడోల లూగగా 
అనురాగ ఝరిలోని 
ఆ అలల గలగలలు 
ప్రణయరాగములోని 
నీ నవ్వు కిలకిలలు
అరుణరాగముదాల్చు
నీ లేత అధరములు 
నవరాగ మాలికతో 
వేసింది బంధములు 
కలత నిద్దురలోన 
కలను వరించి 
కలవరించితివి 
ప్రియతమా “రా” అనుచు!!
*********************************

కామెంట్‌లు