న్యాయాలు -275
శకుని గ్రాహక గతి న్యాయము
******
శకుని అంటే పక్షి.. గ్రాహక అంటే తీసుకొనువాడు.గతి అంటే కదలిక, గమనము, ప్రవేశము, అవకాశము,చర్య, పరిస్థితి,దేశ, మార్గము, ఆశ్రయము,వెడలుట, యాత్ర, సంఘటన, నక్షత్ర మార్గము,గ్రహ గమనము,, జ్ఞానము, పునర్జన్మ,,జీవన దశ లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
శకుని గ్రాహక గతి అంటే పక్షి గమనాన్ని బట్టి దానికి తెలియకుండా మాటు వేసి పట్టుకొనుట.
పక్షుల్ని పట్ఠుకునే వేటగాడు లేదా కిరాతుడు ఏం చేస్తాడు. వల వేసి నూకలు చల్లడమో లేదా చాటున దాగి ఉండి దాని గమనాన్ని నిశితంగా పరిశీలిస్తూ మాటు వేసి దానిని అకస్మాత్తుగా పట్టుకోవడం చేస్తాడు.
పక్షి ఎప్పుడూ పరిసరాలను గమనిస్తూ తనదైన రక్షణలోనే ఉన్నప్పటికీ ఒకోసారి దురదృష్టవశాత్తు వేటగాడి ఉనికిని గమనించక అతని చేతిలో చిక్కుతుంది.
వేట గాడి మనసు తాను పట్టుకోవాలనుకున్న పక్షి మీదే వుంటుంది. ఆకాశంలో ఎగురుతున్న దాని నీడను గమనిస్తూ అది ఎక్కడ వాలిపోయేది అంచనా వేస్తాడు. అలా దానిని అనుసరించి వెళ్ళి చటుక్కున వెనుకనుండి పట్టుకుంటాడు.
అలా వేటగాళ్ళు. పక్షుల్ని వేటాడుతూ వుంటారు.
ఇది పక్షికి వేటగాడికి సంబంధించిన విషయం.ఇందులో ప్రత్యేకత ఏముంది? అనిపిస్తుంది ఎవరికైనా...
దీనినే తాత్విక దృష్టితో చూసిన పెద్దలు పెద్దలు ఏమంటారో చూద్దాం.
పక్షి ఎప్పుడూ అనుకొని వుండదు తానలా వేటగాడి చేతిలో చిక్కుకుంటానని.తనకు కష్టాలు వస్తాయని, ప్రాణాపాయం సంభవిస్తుందని ఊహించదు.
పక్షి లాగే మనం కూడా ముందు ఏం జరుగుతుందో ఊహించలేం.
మనం చేసే క్రియలను బట్టి ఫలితాలను ఊహిస్తాం. కానీ మన ప్రమేయం లేకుండా జరిగేవి మనం ఊహించం. ఊహించలేం కదా!.
ఎంత జాగ్రత్తగా ఉన్నా, మన ప్రమేయం లేకుండా అనుకోని ఆపదలు, సమస్యలు వేటాగాడిలా వివిధ రూపాల్లో వెంటాడుతూ వుంటాయనీ చెప్పడమే ఈ "శకుని గ్రాహక గతి న్యాయము" లోని అంతరార్థం.
అందుకే పెద్దలు ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని "వాన రాకడ- ప్రాణం పోకడ" ఎప్పుడో ఎలాగో తెలియదు.
అధునాతన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ద్వారా వాన వచ్చేది తెలుకోగలిగాం కానీ ప్రాణం ఎప్పుడు ఏ విధంగా పోతుందో నేటికీ తెలుసుకోలేక పోయాం.
కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒక్కటే .సాధ్యమైనంత వరకూ మన జాగ్రత్తలో మనం ఉండటం చేయాలనుకున్న మంచి పనులు సకాలంలో చేయడం.ఏం జరిగినా వాటిని ఎదుర్కొనే శక్తిని, ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోవడం .
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏s

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి