పాదాభివందనములు --.కోరాడ నరసింహా రావు
అ ఆ   లు  దిద్దించి... 
  అన్ని విషయాలు బోధించి... 
       గుణ -  దోషములు తెలిపి 
          బ్రతుకు  దారి  జూపు... 
    ఉపాద్యాయులకివే... 
       పాదాభి వందనములు !

ఉగ్గు పాలతోనే.... 
   సుద్దులెన్నో చెబుతు.... 
     అడ్డాల లోనే... 
       మాతృభాషను తెలిపు...
          అమ్మె  కద తొలిగురువు 
    అమ్మకివే హృదయాభి వందనములు !

అన్నిటిని సమకూర్చి.... 
   . తన భుజాల కెత్తుకుని...   
     సమాజాన్ని చూపిస్తూ... 
       చేయిపట్టి నడిపిస్తూ.... 
      నడక - నడత నేర్పించిన 
     తండ్రేకద మలి గురువు... 
 నాన్నకు అభివందములు !

పరిసరాలు - ప్రక్రుతి.... 
  పరోక్షముగ.. పాఠాలూ 
    గుణ పాఠాలను... 
 నేర్పించే గురువులే కదా... 
   కృతజ్ఞతాభి వందములు !

బాల్యమునుండీ... 
    వీరంతా... జ్ఞానమునిచ్చి ... 
      బ్రతుకును నేర్పే.... 
     ఉపాధ్యాయులేను... !
 వీరందరికీ వందములు.... 
 పాదాభి వందనములు... !!
       ******

కామెంట్‌లు