ఉక్కు మనిషికి నివాళి
 తొట్టంబేడు:మండలంలో దిగువ సాంబయ్య పాళెంప్రాధమిక పాఠశాల లో సర్థార్ వల్ల భాయ్ పటేల్ జయంతి పురస్క రించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భం గా ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్వతంత్రతొలి ఉప ప్రధాని  హోం శాఖ
మంత్రిగా వల్లభాయ్ పటేల్ దేశానికిఎనలేని సేవలందించిన నాయకుడు అని ప్రాంతాలన్నిటినీ విడిపోకుండా ఒకేతాటిపై నిలిపిన ధీశాలి అన్నారు.దేశనాయకుల చరిత్రలను విద్యార్థులు
తెలుసుకుని ఆదర్శంగా నిలవాలన్నారు.అనంతరం సర్థార్ చిత్రపటానికి మిల్లులు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్ర మంలో విద్యార్థులు మరియు అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు