దేవుడు ఎక్కడ? అచ్యుతుని రాజ్యశ్రీ

 క్లాస్ లో పిల్లలంతా దసరా సెలవులు అని తెగ ఆటపాటలు టి.వి.తో గడుపుతున్నారు.తాత వారిని పిలిచి "కాసేపు దేవుని శ్లోకాలు పాటలు పాడండి" అంటే శివా అన్నాడు" తాతా! దేవుడు గుళ్ళో కదా ఉంటాడు.ఇంట్లో పాడితే ఏంలాభం?" "దేవుడు సర్వాంతర్యామి.కానీ ప్రత్యేక ప్రాంతం లో అంతా కల్సి పూజలు పాటల్తో చేయడంవల్ల వాతావరణం కాలుష్యం విముక్తి పొందుతుంది.సకారాత్మక భావాలు వస్తాయి.అందుకే చర్చీ మసీదులో సామూహిక ప్రార్థనలు చేస్తారు.ఉప్పు చక్కెర నీటిలో కరిగి కంటికి కనపడవు.కానీ తాగితే రుచి తెలుస్తుంది.అలాగే దేవుడు కూడా.ఒక వ్యక్తిని మనం హైదరాబాద్ చూపించాలి అని తెచ్చాం.అన్ని ప్రాంతాలు చూపి కళ్ళకు గంతలు కట్టి వదిలేస్తే అతను మన ఇంటిని కనుక్కోగలడా?"" అయ్యో! అలా చేస్తే ఎలా తాతా? అడ్రస్ చెప్పాలి కదా?" " అడ్రస్ ఇచ్చినా అతను కళ్ళగంతలతో 
ఎలా మన ఇల్లు గుర్తుపడ్తాడు? అందుకే గంతలు విప్పేసి దారి చూపాలి.అలాగే మనం పురాణకథలు చదవడం వినడం వల్ల దేవునిపై భక్తి ఆత్మ విశ్వాసం ఏర్పడతాయి.ఈ భక్తి పుస్తకాలు చదివి నాకు కథచెప్పండి. ముక్కు మూసుకుని జపం చేయమనటంలేదు.కాసేపైనా దైవ నామ స్మరణ చేస్తూ ఉంటే మంచిభావాలతో ఇతరులకి సాయంచేస్తే చాలు." అంతే పిల్లలంతా గుడికి వెళ్ళి అక్కడ మంత్రాలతో జరిగే హోమాలు చూడసాగారు.🌹
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం