విజయనగర ఉత్సవాల్లో రాజాం రచయితలకు సత్కారాలు.
 రాజాం రచయితల వేదిక సభ్యులు కుదమ తిరుమలరావు, 
పోలాకి ఈశ్వరరావులు విజయనగరం జిల్లా ఉత్సవాల కవిసమ్మేళనంలో పాల్గొని సత్కారాలు పొందారు.
విజయనగరం మహారాజా కళాశాల రిక్రియేషన్ క్లబ్ సాహిత్య వేదిక ప్రాంగణంలో నిర్వహించిన శతాధిక కవిసమ్మేళనం పిలుపు మేరకు తిరుమలరావు, ఈశ్వరరావులు హాజరై, తమ కవితలు వినిపించారు.
పుస్తకం హస్త భూషణం అను కవితను తిరుమలరావు, మాతృభాషను మరువకురా అను కవితను ఈశ్వరరావు వినిపించి అందరి ప్రశంసలు పొందారు.
అనంతరం తిరుమలరావు , ఈశ్వరరావులను కార్యక్రమ నిర్వాహకులు ప్రముఖ సాహితీవేత్తలు
చివుకుల శ్రీలక్ష్మి, చీకటి దివాకర్, శీమల చంద్రిక, డైట్ ప్రిన్సిపాల్ డా.నల్ల తిరుపతినాయుడు, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి డా.ఎన్.గోవిందరావు, 
జిల్లా కో ఆపరేటివ్ విభాగం అధికారి డి.రమేష్, మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ డా.జి.జనార్ధన నాయుడు, స్వప్న హైందవి, 
సాలూరు సంతోషి, 
మింది విజయమోహనరావు, 
తాడిపూడి వెంకటరమణ, 
మీసాల చినగౌరునాయుడు,  కిలపర్తి దాలినాయుడు తదితరులు శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. 
తిరుమలరావు, ఈశ్వరరావులు విజయనగరం జిల్లా ఉత్సవాల వేదికపై సాహితీ సత్కారాలు పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం, 
శాసపు రామినాయుడు, ఆల్తి మోహనరావు, ఒమ్మి రమణమూర్తి, పిల్లా తిరుపతిరావు తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు