తత్ర ఏవ వసతా జనస్థాన నివాసినీ |
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామ రూపిణి !
తతః శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వ రాక్షసాన్
నిజఘాన రణే రామః తేషాం చ ఏవ పద అనుగాన్ !
వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం !
ఆ దండకారణ్యమున రావణుని సేన నివాస స్థానమున శూర్పణక అను రక్కసి నివసించు గుండెను.
శ్రీరాముడు లక్ష్మణుని చే కామరూపిణి అయినా ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులు కోయించి , ఆమెను వికృత రూపను గావించెను.
అనంతరం శూర్పణఖచే రెచ్చగొట్టబడిన
ఖరుడు, దూషణుడు,త్తిసురుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతో గూడి యుద్ధ సన్నద్ధులై వచ్చిరి. అంతట రాముడు ఒక్కడే జనస్తాన నివాసులైన ఖర ,దూషణ, త్రిశరులను, రణభూమికి బలి గావించెను.
శ్రీరాం
***
శ్రీరాముడు ; కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి