పరోపకారం పుణ్యం
పరోపకారాయ ఫలన్తి వృక్షాః
పరోపకారాయ వహన్తి నద్యః
పరోపకారాయ దుహన్తి గావః
పరోపకారార్థమిదం శరీరమ్
నరసింహ శతకంలోని ఈ నానుడి నిత్యం ప్రజల నోళ్లలో నానుతూ వుంది. బహుశా ఈ ఆధునిక యుగంలో నిస్వార్ధమైన, పవిత్రమైన నడవడిక అలవరచుకునేందుకు ఇంతకంటే ఉత్తమమైన మార్గం ఇంకొకటి లేదనిపిస్తోంది. ఏ ఫలం ఆశించకుండా మనుషులకు వృక్షాలు ఫలాలని అందిస్తున్నాయి.
ఫలాలు మనుషులకు ఆరోగ్యవంతమైన మంచి పోషక ఆహారం అందిస్తాయి. . భూమి పంటల్ని ఇస్తుంది. అలాగే మనిషి కూడా తనకి భగవంతుడిచ్చిన శరీరంతో పరులకి ఉపకారం చెయ్యాలి అన్నది ఈ శ్లోకం భావం. మనిషికి కావలసినవన్నీ భగవంతుని సృష్టిలో లభ్యమవుతున్నాయి. అవేవీ మనిషి నుండి ప్రత్యుపకారం ఆశించకుండా ఉపకారం చేస్తున్నాయి. మన ధర్మ శాస్త్రం ఇలా చెబుతోంది: 'పరోపకారం వహంతి నాద్య, పరోపకారం దుహంతి గాయ, పరోపకారం ఫలంతి వృక్ష, పరోపకారం ఇదం శరీరం' అంటే 'పరోపకారానికి నదులు ప్రవహిస్తాయి, ఆవులు పరోపకారానికి పాలు ఇస్తాయి, పరోపకారానికి చెట్లు ఫలాలను ఇస్తాయి, అలాగే ఈ శరీరం కూడా పరోపకారానికి ఉద్దేశించబడింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి