కువలయపీడన మనే ఏనుగును చంపిన మీదటవారు కోట ద్వారం వద్ద వేడుకలు చూస్తూ ఉన్నారు
శ్రీ కృష్ణ,బలరాములు.
నిండు దర్బారు కలకల లాడుతోంది.అల్లంత దూరాన కంస మహారాజుసింహాసనంమీదకూర్చునిఉన్నాడు.
మహారాజుకి ఎదురుగా మల్లయుద్ధము జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అతివైభవంగానిర్మించిబడినఆరంగమందుముష్టికుడు,చాణూరకుడు , మొదలైన ముష్టి యుద్ధ
వీరులు తయారుగా ఉన్నారు.
ముష్టికుడు ద్వారం వైపు తిరిగి వెటకారంగా ఓయీ! కృష్ణా!బలరామా! మీరు చూపులకు పిన్నలే
కాని నిజంగా ఎంత గొప్ప వారో .మీ బలం మాకంస
మహారాజుచూసిమెచ్చుకుంటారట ,ఏదీ రండి మాతో ఒక్కసారి కుస్తీ పట్టి మమ్మల్ని ఓడించండి అని అంటూ కయ్యానికి కాలు దువ్వారు.
కృష్ణ బలరాములుని చూస్తే ముష్టికుడి పిడికిలి లో ఇమిడి పోయేటట్లు ఉన్నారు.
ఈ పసిపిల్లలు మల్లయుద్ధమా ?ఎంత విడ్డూరం.ఇందులో ఏదో మాయఉందనిఅందరూభయపడ్డారు.అది మహారాజు గారి ఆజ్ఞ .
చాణూరకునితోకృష్ణుడు ,ముష్టికునితో బలరాముడు తలపడి అత్యద్భుతంగా పట్టుపట్టారు
కృష్ణ బలరాములు మాటిమాటికీ ఒక దెబ్బ,ఒక గుమ్కీ దెబ్బ ఇచ్చి పల్టీ కొట్టి నప్పుడల్లా ముష్టిక
చాణూరులు, నేలమీద పడి అమ్మో! అంటూ ఉండేవారు.కొంతసేపు వినోదంగా పట్లు పట్టిన తరువాత .
బాలకృష్ణుడుచాణూరినిచేతులు,కాళ్ళు కలిపిపట్టుకుని ,ఎగురవేసి నట్టు ఆకాశం మీదకు విసిరేసాడు. వాడుఅమాంతం నేల మీద పడి కృష్ణా! కృష్ణా అని అంటూ ప్రాణాలు విడిచాడు. ముష్టికునికి
అదే గతి పట్టింది తర్వాత వరుసగా సీల కూట తోచ కులు మృతి చెందేరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి