నీ రాకతో
నా మనసులో మధుమాస సుధలు నిండాయి
నీ అడుగుతో
నా ఆలోచనామేఘమాలికలు సమాయత్తమైనాయి
నీ పలుకుతో
నా హృదయంలో పైడిపంటల సిరులు నాట్యంచేశాయి
నీ పిలుపుతో
నాకు శరచ్చంద్రికలలో విహరించిన పారవశ్యంకలిగింది.
నీ చూపుతో
నా కళ్ళల్లో తుషార బిందువుల ధవళకాంతి నిండింది
అందుకే కదూ ప్రియా!
మనిషికీ ప్రకృతికీ అవినాభావ సంబంధం
ప్రతి ఆలోచనా ప్రకృతి బద్ధమై
ప్రతిపనీ ప్రకృతికి నిబద్ధమై
ప్రకృతిలో మనమూ ఒక భాగంగా
కాదు కాదు...
ప్రకృతీ మనమూ ఒకటిగా
ఏకమౌదాం!!
*********************************
ఏకమౌదాం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి