వోని లో విద్యార్థులకు క్రీడా సామగ్రి పంపిణీ
 విద్యార్థిణీ విద్యార్థులకు క్రీడా పరికరాలను పంపిణీ చేసామని వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి తెలిపారు. 
మండల పరిషత్ విద్యాశాఖ వారు తమకు పంపిణీ చేసిన ఆట వస్తువులను నేడు బాలబాలికలకు అందజేసామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయని నాగమణి మాట్లాడుతూ శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. 
పాఠశాల సహోపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ, దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావులు పాల్గొని ఆటలు ఆడేటప్పుడు ఏయే జాగ్రత్తలు పాటించాలో వివరించారు. 
ఛెస్, స్కిప్పింగ్ తాళ్ళు, రింగులు, వాలీబాల్ లు, నెట్ తదితర ఆట వస్తువులు విద్యార్థులకు అందజేసారు.
కామెంట్‌లు