యే కార్యం కోసం పుట్టాడో...
. ఆ కార్యం పూర్తి కాగానే...
ఏ పదవులనూ ఆశించక...
తన నిష్కామకర్మ తత్వాన్ని..
నిరూపించి.... సబర్మతిలో...
తాను పరమాత్మ చింతనతో...
రఘుపతి రాఘవ రాజారాం...
పతీత పావన సీతారాం....
అని... చింతనలో తానుండగా
పేలెను తుపాకి... !
గాంధీజీగుండెల్లోకి...
దూసుకు పోయెను తుపాకిగళ్ళు... !!
చంపవచ్చిన వానినీ....
క్షమించమనగల...
ఔదార్యమూర్తీ.... !
హే రామ్... హే రామ్....
అంటూనే తరలి పోతున్నావా
నువ్ కలలు గన్న...
స్వరాజ్యం కాదిది... !
కుట్రలు - కుతంత్రాలు
అన్యాయాలు - అక్రమాలకు
నెలవైనది.. !!
వెనుదిరివి నువ్ చూడబోకు
చూసినా నువ్ మరలిరాకు !
వచ్చినా... నోరువిప్పబోకు !!
*******
కారణ జన్ముడు గాంధీ.... !;- ... కోరాడ నరసింహా రావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి