ఎదఎదకొక కథ వున్నది
ప్రతిఎదకొక వ్యథ వున్నది
అమ్మదో, చెల్లిదో,
అనురాగవల్లిదో
ఏదైతేనేం ఏమైతేనేం
ప్రతి కథలో సెంటర్ పాయింటు
“ఆమె” దే.
ఏ క్షణాన మనువుగారు
“నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి” అన్నారో
మగమహారాజులు దాన్ని
అక్షరాలా పాటిస్తున్నారు.
కాని, ఆ మనువే చెప్పిన
"యత్రనార్యంతు పూజ్యతే...”
అనేదాన్ని మాత్రం
తుంగలో తొక్కారు.
ఎందుకంటే...
వీరు మగధీరులుకదా!
వారికి నచ్చిందే చేస్తారు
జీవితంలో
“అర్ధ”నారి అని తెలిసినా
దాన్ని కేవలం
“పడక్కి" మాత్రం పరిమితం చేశారు
ఏం? మరి
అన్నింటిలోనూ “అర్ధ” కాలేదా?
"ముదితల్ నేర్వగరాని విద్య గలదె
ముద్దార నేర్పింపగన్" అన్నదెరుగరా?
అయినా
అదంతా వారి లలాటలిఖితం కదూ?!
అన్నట్లు అది రాసినోడూ
మగవాడే కదూ?!
*********************************
వ్యథ;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి