రేపల్లెలో బాల కిట్టయ్య ;- ఎం. వి. ఉమాదేవి
బాల పంచపది 
============
అనగనగా ఓ కంసరాజు
క్రూరమైన పనులే మోజు
చెల్లి దేవకికి పెళ్ళైనరోజు
రథమున తోడువెళ్ళురోజు
ఆకాశవాణి పలికేను ఉమా!

ఆగవోయి రాజా ఓ కంసా 
మధురానగరిన ఏలహింసా
నీ చెల్లిపెళ్లికేలనో కులాసా
ఆమెబిడ్డ నీయముడు తెలుసా
ఇది తథ్యం అనెను ఉమా!

గడగడ వణికెను కంసుడు
రథమును ఆపెను క్రూరుడు
కత్తిని పట్టెను దుర్మార్గుడు
చెల్లిని చంపబోయే నీచుడు
అశరీరవాణి పలుకుకి ఉమా!

దేవకి భర్త వసుదేవుడు
సూర్యక్షత్రియ వంశజుడు
కరుణించమని వేడాడు
ప్రతిబిడ్డని ఇస్తానన్నాడు
ప్రాణరక్షణ చేసేడు ఉమా!

దంపతులకు చెరసాలలోను
ఏడుమంది బిడ్డలు పుట్టెను
అందర్నీ కంసుడు చంపెను
అష్టమగర్భం రోహిణియందును
బలరాముడై పుట్టెను ఉమా!

యోగమాయ పలికేనయ్య
కంసునిచావు తప్పదనయ్య
విష్ణువు అంశలోన కృష్ణయ్య
దేవకి గర్భమున పెరిగెనయ్య
అర్థరాత్రిలో జన్మించే ఉమా!
*******
కామెంట్‌లు